“బంగార్రాజు” టీజర్‌లో “నాగ చైతన్య” పక్కన కనిపించిన ఈ నటిని గమనించారా..?

“బంగార్రాజు” టీజర్‌లో “నాగ చైతన్య” పక్కన కనిపించిన ఈ నటిని గమనించారా..?

by Mohana Priya

Ads

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు.

actress in bangarraju teaser

న్యూ ఇయర్ సందర్భంగా టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా సంక్రాంతి కనుకగా విడుదల అవ్వబోతోంది. టీజర్‌లో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, క్రితి శెట్టి కనిపించారు. వీరు మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న మరి కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. వీరిలో ఒక షాట్‌లో నాగ చైతన్య ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తారు. ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది వెతికారు. ఆ అమ్మాయి పేరు దక్ష నాగర్కర్.

దక్ష అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించారు. హుషారు సినిమాలో కూడా ఒక హీరోయిన్‌గా నటించారు. 2013లో వచ్చిన “ఇష్ట సఖి” సినిమాతో దక్ష ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత “ఏకే రావు”, అలాగే తేజ దర్శకత్వంలో వచ్చిన “హోరా హోరీ” సినిమాల్లో నటించారు. ఇటీవల విడుదలయిన “జాంబీ రెడ్డి”లో కూడా దక్ష నటించారు. ఇప్పుడు బంగార్రాజు సినిమాలో కూడా ఒక హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది.


End of Article

You may also like