వైరల్ వీడియో: సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

వైరల్ వీడియో: సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

by Megha Varna

Ads

నటి శ్రియ ఇటీవల విడుదలైన ” గమనం” సినిమా చూసేందుకు థియేటర్ కి ఆటోలో వచ్చారు. ఆడియన్స్ తో కలిసి తాను నటించిన చిత్రం చూసేందుకు శ్రియ డిసెంబర్‌ 10 న కుకట్‌పల్లి మల్లిఖార్జున థియేటర్ కు ఆటోలో రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఆమె ఆటోలో థియేటర్‌కు రావడం అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచింది.

Video Advertisement

శ్రియ శరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన “గమనం” సినిమాని రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు మరియు జ్ఞాన శేఖర్ నిర్మించారు. సుజనా రావు దర్శకత్వం వహించారు. ఇళయరాజా సంగీతం అందించారు. సినిమా మొత్తం మూడు కథల చుట్టూ తిరుగుతుంది. ఒక కథలో కమల (శ్రియ) అనే ఒక వినపడని దివ్యాంగురాలు దుబాయ్ కి వెళ్ళిన తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కమల తన బిడ్డతో కలిసి హైదరాబాద్ లోని ఒక మురికివాడలో ఉంటుంది.

తర్వాత చెవులు వినిపించడానికి వైద్యం చేయించుకున్న కమల, తన భర్త మాటలు వినాలని ఎదురుచూస్తూ ఉంటుంది. రెండవ కథలో అలీ (శివ కందుకూరి), క్రికెటర్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలీ తన పక్కింట్లో ఉండే జారా (ప్రియాంక జవాల్కర్)ని ప్రేమిస్తాడు. జారాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంక మూడవ కథలో ఇద్దరు అనాథ పిల్లలు కేక్ కోసం అని 300 సంపాదించాలి అనుకుంటారు. అనుకోకుండా వచ్చిన ఒక ప్రకృతి విపత్తు వల్ల ఆ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? వాళ్ళ కలలు నెరవేరాయా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

gamanam movie review

డైరెక్టర్ రాసుకున్న కథ బాగున్నా కూడా, తెరపై చూపించిన విధానం నిరాశపరిచింది. సినిమా స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉంది. దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి కథపై ఆసక్తి కలగడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంక పర్ఫామెన్స్ విషయానికొస్తే, చాలా రోజుల తర్వాత శ్రియని తెలుగు సినిమాల్లో చూస్తున్నాం. కమలగా శ్రియ చాలా బాగా నటించారు. ఒక రకంగా చెప్పాలంటే శ్రియ కెరీర్ లో కొన్ని బెస్ట్ పర్ఫార్మెన్స్ లలో ఈ పాత్ర కూడా నిలుస్తుంది.

ఆలీగా నటించిన శివ కూడా చాలా బాగా చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన ప్రియాంక జవాల్కర్, సుహాస్, సంజయ్ స్వరూప్, చారుహాసన్ కూడా వారి పాత్రలో బాగా నటించారు. అలాగే ఇద్దరు పిల్లలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా చాలా సహజంగా అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా, తెరపై చూపించడంలో ఎక్కడో పొరపాటు జరిగిందేమో అనిపిస్తూ ఉంటుంది.

watch video:

https://youtu.be/_ejzCmXten4


End of Article

You may also like