ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేసాడు…చివరగా ఆ నటి వీడియో రికార్డ్ చేసి.!

ప్రేమ పేరుతో వాడుకొని మోసం చేసాడు…చివరగా ఆ నటి వీడియో రికార్డ్ చేసి.!

by Megha Varna

కర్ణాటకలోని హాసన్ జిల్లా కి చెందిన చందాన అనే 29 యేళ్ళ అమ్మాయి ఎప్పటికైనా సినిమా నటి కావాలని బెంగుళూరు కి వచ్చి ఎప్పటినుండో ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు.అయితే చందాన కొన్ని సీరియల్స్ లో నటిస్తూ కొన్ని ప్రకటనలలో కూడా నటించారు.శాండిల్ వుడ్ ప్రకటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు చందన.అయితే ఒక ప్రైవేట్ కంపినీలో ఉద్యోగం చేస్తున్న దినేష్ అనే వ్యక్తిని ఐదు సంవత్సరాలుగా ప్రేమిస్తూ హద్దులు కూడా దాటారు చందన.అయితే ఎప్పటికైనా దినేష్ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు చందన కానీ దినేష్ మోసం చెయ్యడంతో పురుగుల మందు తాగి బలవంతంగా జీవితాన్ని అంతం చేసుకున్నారు చందన ..వివరాలలోకి వెళ్తే..

చందన ఎప్పటికైనా దినేష్ ను పెళ్లి చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.అయితే ఐదు సంవత్సరాలు గా దినేష్ కూడా పెళ్లి  చేసుకుంటా అని చెప్పాడు.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి మాట ఎత్తితే చాలు ఏదో రకంగా ఆ విషయాన్నీ దాటి వేసేసేవాడు.అయితే చందన కుటుంబ సభ్యులు దినేష్ ఇంటికి వెళ్లి పెళ్లి గురించి అడగగా మీ అమ్మాయి మంచిది కాదు చాలామందితో సంబంధాలు ఉన్నాయి అని అలంటి అమ్మాయి ని మా కోడలిగా ఎలా చేసుకుంటాం అని సమాధానిమిచ్చారు దినేష్ కుటుంబ సభ్యులు.పైగా దినేష్ కూడా వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో మనస్తాపం చెందిన చందన జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నారు.

దినేష్ నువ్వు నన్ను శారీరకంగా వాడుకున్నావ్ అంతేకాకుండా నా డబ్బులను కూడా వాడుకున్నావ్.ఇంకా నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసావ్ అందుకే నేను విషం తాగి చనిపోతున్నాఅని ఓ వీడియో రికార్డు చేసి దినేష్ కు పంపించింది.దీంతో వెంటనే దినేష్ చందన  ఇంటికి వచ్చి చూడగా అపస్మారక స్థితిలో  చందన కనపడింది.అయితే వెంటనే చందన ను ఆసుపత్రి కు తీసుకువెళ్లాడు దినేష్. కానీ ఆసుపత్రి కి వచ్చేటప్పటికే చందన మృతి చెందిందని డాక్టర్ లు చెప్పడం తో అక్కడ నుండి పరారు అయ్యాడు దినేష్.అయితే పోలీస్ లు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు.

You may also like