Ads
సోగ్గాడే చిన్ని నాయన, అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, లౌక్యం లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి హంసా నందిని సోషల్ మీడియా వేదికగా ఒక ముఖ్యమైన విషయం తెలిపారు. ఒక ఫోటో షేర్ చేస్తూ, తనకి క్యాన్సర్ అని తెలిసింది అని చెప్పారు. తన ఫోటోతో పాటు ఒక నోట్ ని షేర్ చేసిన హంసా నందిని ఈ విధంగా రాసారు.
Video Advertisement
“నాలుగు నెలల క్రితం నాకు ఏదో సమస్య ఉన్నట్లు అర్థమయ్యింది. ఆ తర్వాత ఇంక నా జీవితం ముందులాగా ఉండదు అని అర్థమయ్యింది. తర్వాత నేను హాస్పిటల్ కి వెళ్లాను. డాక్టర్ నాకు బయాప్సీ చేయాలని చెప్పారు. అప్పటికే నేను అనుకున్నది నిజం అయ్యింది. నాకు గ్రేడ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. నేను ధైర్యంగా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లాను. అక్కడ నా ట్యూమర్ తీసేసారు.”
“ముందే తెలుసుకొని జాగ్రత్త తీసుకున్న కారణంగా క్యాన్సర్ వ్యాపించలేదు అని చెప్పారు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ తర్వాత నాకు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ అని తెలిసింది. అంటే నాకు భవిష్యత్తులో ఇంకొక బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి 70 శాతం అవకాశాలు, ఒవేరియన్ క్యాన్సర్ రావడానికి 45 శాతం అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి నాకు కీమోథెరపీలో 9 సైకిల్స్ అయ్యాయి. మరొక 7 సైకిల్స్ ఉన్నాయి. నేను నా కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. నేను దీనికి (క్యాన్సర్ కి) నా జీవితాన్ని మార్చే హక్కు ఇవ్వను. ఏదైనా నవ్వుతూ పోరాడి గెలుస్తాను.”
“నేను ఇంకా స్ట్రాంగ్ గా అయ్యి మళ్ళీ తెరపై కనిపిస్తాను. చాలా మందిని ప్రోత్సహించడానికి, వారికి అవగాహన పెంచడానికి నేను నా కథని చెప్తాను. అలాగే నా ఇన్‌బాక్స్ మొత్తం మెసేజెస్ తో నిండి పోయింది. చాలా మంది నేను యాక్టివ్‌గా లేకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చాలా థాంక్యూ. మీ మెసేజెస్ వల్లే నేను ధైర్యంగా ఉండగలిగాను. నేను మంచి డాక్టర్ల ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు సినిమా రంగానికి చెందిన ప్రముఖులకి, కుటుంబానికి, స్నేహితులకు అందరికీ థాంక్యూ” అని రాశారు హంసా నందిని.
End of Article