Home Filmy Adda “రాధే శ్యామ్” కొత్త ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“రాధే శ్యామ్” కొత్త ట్రైలర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా రాధే శ్యామ్. ఈ సినిమా రాధే శ్యామ్ గురించి అభిమానులు దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. భారతదేశం అంతటా కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమాలో విక్రమాదిత్య అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రేరణ అనే పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. అయితే జనవరిలో విడుదల అవ్వాల్సిన రాధే శ్యామ్ సినిమా వాయిదా పడి మార్చ్‌లో విడుదల అవ్వబోతోంది. దాంతో రాధే శ్యామ్ సినిమా బృందమంతా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనిలో ఉన్నారు.

actress in radhe shyam new trailer

ఇటీవల ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి ఇంకా పెరిగింది. ఇందులో కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అని ఈ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అలాగే అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్, లేదా సినిమాకి సంబంధించిన వేరే వీడియోల్లో కనిపించని కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు. అలా ఒక నటి కూడా నిన్న విడుదల అయిన ట్రైలర్ లో కనిపించారు.

actress in radhe shyam new trailer

ప్రభాస్ ఒక అమ్మాయితో స్పోర్ట్స్ వద్దు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఆర్చరీ వైపు ఆసక్తి చూపడం మనం ట్రైలర్ లో చూశాం. ఆ నటి పేరు రిద్ధి కుమార్. రిద్ధి కుమార్ అంతకుముందు కొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత అనగనగా ఒక ప్రేమ కథ అనే ఒక తెలుగు సినిమాతో పాటు, ప్రణయ మీనుకలుడే కాదల్ అనే ఒక తమిళ్ సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.

You may also like