ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.? 54 ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నారంటే.?

ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.? 54 ఏళ్ళు వచ్చినా ఇంకా సింగిల్ గా ఎందుకు ఉన్నారంటే.?

by Sainath Gopi

Ads

నటి లక్ష్మీ గోపాలస్వామి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె కర్ణాటకకు చెందిన నటి మరియు గొప్ప శాస్త్రీయ నృత్యకారిణి. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించిన లక్ష్మీ గోపాలస్వామి, తెలుగు, కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించారు.

Video Advertisement

అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే తల్లిగా నటించారు. కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో, సీరియల్స్  నటించిన ఆమెకు 54 ఏళ్ళ వయసు. అయినా ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
2000 సంవత్సరంలో మమ్ముట్టి హీరోగా నటించిన మలయాళ మూవీ ‘అరయన్నంగళ్ వీడు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.  ఆ సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆ తరువాత పరదేశి సినిమాకు గాను ఉత్తమ సహాయ నటి అవార్డ్ అందుకున్నారు. మలయాళంలో  సాధించిన విజయంతో ఆమెకు కన్నడ సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పటివరకు లక్ష్మి దాదాపు 40 మలయాళ చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి, జయరామ్ వంటి సూపర్ స్టార్లందరితో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. సైరా నరసింహ రెడ్డి మూవీలో కూడా నటించారు. ఆ తరువాత ఆమె టెలివిజన్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి, మలయాళ, తమిళ భాషలలో పలు సీరియల్స్ లో కూడా నటించారు. తెలుగులో 2014 లో ఇటీవీలో ప్రసారం అయిన శ్రీవేంకటేశ్వర కల్యాణం సీరియల్ లో శ్రీదేవిగా నటించారు. ఆమెకు నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే వేలాది ప్రదర్శనలు ఇచ్చారు.

నటి లక్ష్మీ గోపాలస్వామి వయసు ప్రస్తుతం 54 సంవత్సరాలు. అయినప్పటికీ ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు. యాభై నాలుగు వచ్చినా లక్ష్మీ అవివాహితగా మిగిలిపోవడం ఆమె ఫ్యాన్స్ కు బాధ కలిగించే విషయం. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని ఒక సందర్భంలో బయటపెట్టింది. నా హోదా, అందం చూసి కాకుండా నన్ను గా ఇష్టపడే వ్యక్తి ఎదురైనపుడు వివాహం చేసుకుంటానని వెల్లడించారు.

Also Read: “దేవర” గ్లింప్స్ లో ఈ షాట్ గమనించారా..? ఏం ప్లాన్ చేసావయ్యా కొరటాల..?

 


End of Article

You may also like