Ads
లయ గురించి తెలియని వాళ్లు ఉండరు. చక్కటి అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటుంది ఈ భామ. ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించింది లయ.
Video Advertisement
ప్రేమించు సినిమాలో అంధురాలిగా అద్భుతంగా నటించింది లయ. కేవలం ఒక్క తెలుగు చిత్రాలు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది లయ.
‘భద్రం కొడుకో’ అనే చిన్నపిల్లల చిత్రం తో ప్రేక్షకుల కి పరిచయం అయిన లయ స్వయంవరం సినిమా తో హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ప్రేమించు, దేవుళ్ళు, హనుమాన్ జంక్షన్, శివ రామ రాజు ఇలా ఎన్నో సినిమాల లో ఈమె నటించింది.
మంచి హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరం అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గానే ఉంటుంది. బాలకృష్ణ సరసన విజయేంద్ర వర్మ చిత్రం తర్వాత ఈమె కి ఫ్లాపులు ఎక్కువగా రావడం.. ఆ తర్వాత ఈమె ఒక ఎన్నారై ని వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె లాస్ ఏంజెల్స్ లో తన ఫామిలీ తో ఉంది.
తన భర్త బిజినెస్ ని చూసుకుంటూ… పిల్లల్ని కూడా చూసుకుంటూ బిజీ అయి పోయింది. మళ్లీ ఈ హీరోయిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేలానే కనబడుతోంది. తాజాగా లయ ఫ్యామిలీ తో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. ఈమె తన ఫ్యామిలీ తో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. మరి లయ తీసుకున్న అద్భుతమైన ఫ్యామిలీ పిక్చర్స్ పై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
End of Article