Home Biography ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్..! కానీ “సీత” నిజ జీవితంలో ఎన్ని కష్టాలో తెలుసా.?

ఒకప్పుడు హీరోయిన్..ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్..! కానీ “సీత” నిజ జీవితంలో ఎన్ని కష్టాలో తెలుసా.?

by Mohana Priya

ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు పోషించి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు సీత. సీత చెన్నైలో పుట్టారు. సీత తండ్రి మోహన్ బాబు గారు తమిళ్ యాక్టర్. తల్లి చంద్రావతి గారు. సీతకి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒకరి పేరు పాండు ఇంకొకరి పేరు దుష్యంత్.

Actress Seetha unknown details

1985 లో ఒక తమిళ సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టారు సీత. ఆ తర్వాత తమిళ్ సినిమాలతో పాటు ఎన్నో తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు. 1986 లో వచ్చిన ఆడదే ఆధారం అనే సినిమాతో సీత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

Actress Seetha unknown details

అదే సంవత్సరంలో మలయాళం సినిమా ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టారు సీత. 1990 లో నటుడు పార్తీపన్ ని వివాహం చేసుకున్నారు సీత. తర్వాత కొన్ని సంవత్సరాల వరకు సినిమాల్లో నటించలేదు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అభినయ, కీర్తన, రాధాకృష్ణన్. కీర్తన మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన అమృత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.

Actress Seetha unknown details

2001 లో వీరిద్దరు డివోర్స్ తీసుకున్నారు. వీరిద్దరికీ చాలా అభిప్రాయభేదాలు వచ్చాయి అని, ఇంకా ఇద్దరు విడిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి అని ఎన్నో వార్తలు ప్రచారం అయ్యాయి. 2002 లో సీరియల్స్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సీత. అప్పటి నుంచి సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. 2010 లో టీవీ నటుడు సతీష్ ని వివాహం చేసుకున్నారు. 2016 లో వీరిద్దరూ విడిపోయారు. ఇందుకు కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియదు.

Actress Seetha unknown details

You may also like