Home Filmy Adda నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

నాగ చైతన్యకి ఫ్రెండ్‌గా, హీరోయిన్‌గా, తల్లిగా నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

by Mohana Priya

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

ఈ సినిమా “బంగార్రాజు” పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటించారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించారు. చాలా రోజుల తర్వాత మళ్లీ నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది.

heroine who acted with naga chaitanya as friend heroine and mother

ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. పండగకి సరిపోయే సినిమా అని అందరూ అన్నారు. సినిమాలో చాలా మంది తెలిసిన నటీనటులు ఉన్నారు. నాగార్జున ఇందులో తండ్రి, కొడుకు పాత్రల్లో నటించారు. ఒక నాగార్జున పక్కన రమ్య కృష్ణ నటించారు. అలాగే సంపత్ కూడా ఈ సినిమాలో నెగటివ్ పాత్రలో నటించారు. నాగ చైతన్య నాగార్జున రమ్య కృష్ణ మనవడి పాత్రలో నటించారు. అంటే రాము, సీత కొడుకు ఈ చిన బంగార్రాజు.

heroine who acted with naga chaitanya as friend heroine and mother

దీని ప్రకారం రెండవ నాగార్జున పాత్ర అయిన రాము పక్కన నటించిన లావణ్య త్రిపాఠి, నాగ చైతన్యకి తల్లి అవుతుంది. నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి అంతకుముందు యుద్ధం శరణం సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించారు. ఆ సినిమాకంటే ముందు మనం సినిమాలో ఇద్దరు ఫ్రెండ్స్ గా కనిపిస్తారు. ఇలా లావణ్య త్రిపాఠి నాగ చైతన్యకి ఫ్రెండ్ గా, నాగ చైతన్య పక్కన హీరోయిన్ గా, అలాగే నాగ చైతన్య తల్లిగా కూడా నటించారు అన్నమాట. బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదిన విడుదల అయ్యింది. నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలో నటించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. అలాగే నాగ చైతన్య నటిస్తున్న మరి కొన్ని సినిమాల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

You may also like