Home Filmy Adda “అంటే సుందరానికి” లో… హీరోయిన్ అక్క “పుష్ప”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“అంటే సుందరానికి” లో… హీరోయిన్ అక్క “పుష్ప”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదల అయ్యింది. గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది.

ఈ సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.

actress who acted as heroine sister in ante sundaraniki

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం నాని. అసలు నాని కాకుండా ఆ పాత్ర ఇంకెవరైనా చేసుంటే అనే ఆలోచన ఊహించుకోవడం కూడా కష్టమేమో. అంత బాగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అయితే నాని నటన చాలా నాచురల్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా నాని కామెడీ టైమింగ్ కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులు చూశారు.

actress who acted as heroine sister in ante sundaraniki

అయితే ఈ సినిమాలో హీరోయిన్ అక్క పాత్రలో నటించిన నటి కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ నటి పేరు తన్వీ రామ్. తన్వీ మలయాళ నటి. మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగులో తన్వీకి ఇదే మొదటి సినిమా. మొదటి సినిమా అయినా సరే ఈ సినిమాలో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో పుష్ప అనే పాత్రలో తన్వీ నటించారు.తన్వీకి మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన చాలా మంది నటులకి మంచి పేరు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో థియేటర్లలో నడుస్తోంది.

You may also like