Ads
ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు భారతదేశం అంతా కూడా ఎదురు చూసింది. అందుకు మొదటి కారణం రాజమౌళి అయితే రెండో కారణం ఇద్దరు స్టార్ హీరోలు ఒకే తెరపై కనిపించడం. రాజమౌళి వారిద్దరిని కలిపి చూపించాలి అన్న ఆలోచనని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
Video Advertisement
వారిద్దరిలో ఒకరికి ప్రాముఖ్యత పెరిగి మరొకరికి ప్రాముఖ్యత తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు చాలా నెలకొన్నాయి? కానీ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఇద్దరికీ సమానంగా ప్రాముఖ్యత ఉంటుంది అని అర్ధమైపోయింది.
సినిమాలో ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయి. ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలకి మాత్రమే కాకుండా ముఖ్య పాత్రల్లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. వారిలో మల్లి పాత్ర పోషించిన అమ్మాయి ఒకరు. అసలు సినిమాలో కథ మొదలవడానికి ముఖ్యకారణం మల్లి పాత్ర. సినిమా మొత్తం తన మీదే నడుస్తుంది. ఆ పాపని మళ్ళీ తీసుకుని రావడం కోసం కొమరం భీమ్ రావడంతోనే సినిమా మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలో కథలు చాలా ట్విస్ట్లు చోటుచేసుకుంటాయి. ఆ పాత్ర పోషించిన అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. ట్వింకిల్ శర్మ అంతకు ముందు డాన్స్ ఇండియా డాన్స్ అనే కాంపిటీషన్ లో పాల్గొంది.
image source: Facebook (Twinkle Sharma Little Star)
ఆ తర్వాత ఇండియాస్ బెస్ట్ డ్రమెబాజ్ లో టాప్ 8 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. హిందీ జీ ఛానల్ లో ప్రసారమైన చాలా ఈవెంట్స్ లో పాల్గొంది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో టీవీ షోస్ లో ట్వింకిల్ పాల్గొంది. ఇవన్నీ మాత్రమే కాకుండా ఫ్లిప్కార్ట్ ప్రకటనలలో కూడా నటించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యింది. ట్వింకిల్ శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సినిమా విడుదలైన తర్వాత రాజమౌళికి, అలాగే తన పాత్రకి ఇంత మంచి స్పందన వచ్చినందుకు ప్రేక్షకులకి థాంక్స్ చెప్పింది.
Twinkle Sharma Flipkart Ad:
End of Article