Home Biography అంటే సుందరానికి సినిమాలో… హీరో “బామ్మ”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..?

అంటే సుందరానికి సినిమాలో… హీరో “బామ్మ”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..?

by Mohana Priya

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా ఇటీవల విడుదల అయ్యింది. గత కొంత కాలం నుండి నాని ఎన్నో రకాల పాత్రలని చేస్తున్నారు. దాంతో నాని కామెడీ పాత్ర చేసి చాలా సంవత్సరాలు అయ్యింది.

ఈ సినిమాలో నాని మళ్లీ కామెడీ ఎక్కువగా ఉన్న పాత్ర చేస్తున్నారు అని మనకు ముందే అర్థమయ్యింది. నానిని ఇలా చూడాలి అని ప్రేక్షకులు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించినట్టుగానే ఒక సింపుల్ స్టోరీ లైన్ మీద నడుస్తుంది. కానీ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఆ సింపుల్ స్టోరీని కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా చూపించారు.

ante sundaraniki movie review

ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా పాత్రలని ప్రేక్షకులకి పరిచయం చేయడంలోనే అయిపోతుంది. అసలు కథ ఉండేది మాత్రం సెకండ్ హాఫ్ లోనే. సినిమాకి పెద్ద హైలైట్ మాత్రం నాని. అసలు నాని కాకుండా ఆ పాత్ర ఇంకెవరైనా చేసుంటే అనే ఆలోచన ఊహించుకోవడం కూడా కష్టమేమో. అంత బాగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో, క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సీన్స్‌లో అయితే నాని నటన చాలా నాచురల్ గా అనిపిస్తుంది. అంతే కాకుండా నాని కామెడీ టైమింగ్ కూడా చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులు చూశారు.

actress who acted as nani grandmother in ante sundaraniki

ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించిన వారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. వారిలో హీరో బామ్మ పాత్ర పోషించిన వారు ఒకరు. ఆమె పేరు అరుణ భిక్షు. అరుణ దాదాపు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఎంతోమందికి నటన, డాన్స్ నేర్పించారు. అరుణ అంతకుముందు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన మెంటల్ మదిలో, అలాగే బ్రోచేవారెవరురా సినిమాల్లో కూడా నటించారు. ఇప్పుడు అంటే సుందరానికి సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు.

actress who acted as nani grandmother in ante sundaraniki

image source : Instagram (mahathibhikshu)

అరుణ పోషించిన పాత్రకి చాలా మంచి స్పందన లభించింది. అరుణ కూతురు మహతి భిక్షు కూడా జార్జ్ రెడ్డి, రాధే శ్యామ్ వంటి సినిమాల్లో నటించారు. అలాగే కిన్నెరసాని అనే ఒక సినిమాలో కూడా నటించారు. అలాగే మహేష్ బాబు కూతురు సితారకి కూడా డాన్స్ నేర్పిస్తున్నారు. సితార కూచిపూడి డాన్స్ వీడియో పోస్ట్ చేసినప్పుడు తనకి గురువులైన అరుణ భిక్షు, మహతి భిక్షుకి థాంక్స్ చెప్పింది. అలాగే సితార చేసిన మరొక డాన్స్ వీడియోలో కూడా మహతి కనిపిస్తారు.

watch video : 

video source : Instagram (sitaraghattamaneni)

https://www.instagram.com/reel/Cbz1TGOlfQA/?utm_source=ig_web_copy_link

You may also like