ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధే శ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు.ప్రభాస్, దిల్ రాజు గారి బ్యానర్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇది ప్రభాస్ 25వ సినిమాగా రాబోతోంది. ఈ సినిమాకి కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తారు అనే వార్త గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాకి టైటిల్ కూడా దిల్ రాజు గారు రిజిస్టర్ చేయించారు. ఈ సినిమాకి వృందావన్ అనే టైటిల్ ఖరారు చేశారు అనే వార్త వినిపిస్తోంది.11 prabhas

ఈ సినిమాలో హిందీ సీరియల్ స్టార్ నటి హీనా ఖాన్ నటించబోతున్నారని సమాచారం. హీనా ఖాన్ హిందీ బిగ్ బాస్ లో కూడా పాల్గొని ఫైనల్స్ వరకు వచ్చారు. బిగ్ బాస్ లో కూడా అంతకు ముందు హీనా ఖాన్,” తనకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హీరోయిన్ రోల్ ఫర్ చేశారు అని, కానీ బరువు పెరగమన్నారు అని ఆ రోల్ తాను రిజెక్ట్ చేశారు అని చెప్పారు. అలాగే సౌత్ ఇండియన్స్ కి హీరోయిన్స్ అందరూ లావుగా ఉండాలి” అని కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ అప్పుడు చాలా కాలం వరకు చర్చలో నిలిచాయి.actress who commented on south indian heroines

హీనా ఖాన్ చెప్పిన దాని ప్రకారం తనకి ఆఫర్ చేసిన రోల్ అంజలి పోషించిన పాత్ర అని స్పష్టంగా అర్ధమవుతోంది. అయితే అంతకు ముందు ఇలాంటి కామెంట్స్ చేసిన నటి ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం అనేది కొంచెం చర్చనీయాంశమైన అంశమే. అది కూడా మళ్లీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నిర్మాత దిల్ రాజు గారి సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడం అనేది గమనార్హం. ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

watch video :