పుష్పలో “హీరో తల్లి”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

పుష్పలో “హీరో తల్లి”గా నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Megha Varna

Ads

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోలలో ఒకరు. క్లాస్, మాస్, ఫ్యామిలీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా నటనతో అలరించారు అల్లు అర్జున్. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప సినిమా ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోంది.

Video Advertisement

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సంబరాలు కూడా జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో పుష్ప రాజ్ తల్లి కింద కల్పలత నటించారు. తల్లిగా నటించిన కల్పలత అందరినీ బాగా ఎట్రాక్ట్ చేశారు. నటనతో ఎంతో బాగా ఆకట్టుకున్నారు. దీంతో ఆమెపై ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అయితే కల్పలత తాజాగా మీడియా కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

దానిలో ఆమె పాత్ర గురించి, అల్లు అర్జున్ గురించి చెప్పారు. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు కూడా యూఎస్ లోనే ఉంటున్నారు. మగ పిల్లలు ఈమెకి లేరు. అయితే బన్నీని చూడగానే ఇలాంటి మగపిల్లవాడు ఉండాలి అని అనుకున్నారట. అలానే ఆమెకి మగపిల్లలు లేరని బాధపడ్డారట.

సినిమా షూటింగ్ సమయంలో బన్నీ చాలా బాగా సపోర్ట్ చేశారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఆమెకు సపోర్ట్ ఇస్తూ చేయి పట్టుకోవడం, నేనున్నానని భరోసా ఇవ్వడం చూసి ఆమె ఏడ్చేశారని అన్నారు. ఈమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. అయితే పుష్ప మాత్రం బాగా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది.

ఈ చిత్రంలో నటించడానికి ఆరు నెలల ముందే తనకి ఆడిషన్ నిర్వహించారని.. ఆరు నెలల తర్వాత అల్లుఅర్జున్ కు తల్లిగా నటించే అవకాశం వచ్చిందని ఫోన్ చేసి చెప్పారని ఆమె అన్నారు. ఆ ఫోన్ కాల్ రాగానే ఎంతో ఆనందపడ్డాను అని.. సుకుమార్ కి కృతజ్ఞతలు కూడా తెలిపానని అన్నారామె.


End of Article

You may also like