Home Biography “టక్ జగదీష్”లో హీరో తల్లిగా నటించిన నటి గురించి… ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

“టక్ జగదీష్”లో హీరో తల్లిగా నటించిన నటి గురించి… ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?

by Mohana Priya

నాని హీరోగా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సినిమా టక్ జగదీష్. ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నిన్ను కోరి తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమా ఇది. ఈ సినిమాలో నాజర్, రోహిణి, ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ, జగపతి బాబు ఇలా దాదాపు అందరూ తెలిసిన నటులే ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రం సినిమాలో కొత్తగా కనిపించారు. తనే నాని తల్లి పాత్ర పోషించిన నటి. ఆ నటి పేరు మాల పార్వతి.

Actress who played Nani mother in tuck Jagadish

పార్వతి తిరువనంతపురంలో పుట్టారు. పార్వతి సైకాలజీలో మాస్టర్స్ ఎంఫిల్ చేయడంతో పాటు, కేరళ లా అకాడమీ నుండి ఎల్.ఎల్.బి పట్టా కూడా పొందారు. ఏషియానెట్ లో ప్రసారమయిన ఒక ప్రోగ్రాం ద్వారా పార్వతి యాంకర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు. 2007లో మలయాళం సినిమా టైంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వందకు పైగా సినిమాల్లో నటించారు పార్వతి. అందులో చాలా వరకు మలయాళం సినిమాలు ఉన్నాయి. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

Actress who played Nani mother in tuck Jagadish

అలాగే తాప్సీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఓవర్ సినిమాలో డాక్టర్ రీనా అనే పాత్రని పోషించారు. టక్ జగదీష్ లో అర్జునమ్మ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు పార్వతి. వీటితో పాటు కొన్ని మలయాళం షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించారు. పార్వతికి సతీషన్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఆయన గవర్నమెంట్ ఆఫ్ కేరళ C-DIT లో పని చేస్తారు. వారికి అనంతకృష్ణన్ అనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక కొడుకు కూడా ఉన్నాడు.

You may also like