తొలిచిత్రంలోనే ఎక్స్ పోజింగ్… ఆ పాత్ర వలనే ఆ సినిమా సూపర్ హిట్!

తొలిచిత్రంలోనే ఎక్స్ పోజింగ్… ఆ పాత్ర వలనే ఆ సినిమా సూపర్ హిట్!

by Megha Varna

Ads

మౌనపోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన నటి యమున..తర్వాత దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి మెప్పించింది..తర్వాత బుల్లితెరపై విధి,అన్వేషిత వంటి టాప్ సీరియళ్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.. తొలి చిత్రం మౌన పోరాటం సినిమాలోనే ఎక్స్ పోజింగ్ చేసింది అనే విమర్శలు ఉన్నాయి..అదే విషయంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించింది యమున..

Video Advertisement

సబిత అనే అమ్మాయి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో యమున గిరిజన యువతిగా నటించింది..తనను మోసం చేసిన అధికారి మెడలు వంచి తన బిడ్డకి అతడే తండ్రి అని తన నోటితోనే చెప్పించేలా మౌనపోరాటం చేసిన ఒక మహిళ కథ ఇది..విభిన్న చిత్రాల దర్శకుడు మోహనగాంధి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రామోజిరావ్ నిర్మించారు.ప్రముఖ గాయని ఎస్ .జానకి సంగీత దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం మౌనపోరాటం..

“ఆ సినిమాలో పాత్ర మేరకే ఎక్స్ పోజింగ్ చేసానని చెప్పుకొచ్చారు యమున..ఆ చిత్రంలో ఎక్స్ పోజింగ్ చేయాలని నాతో చెప్పడానికి దర్శకుడు మోహన్ క్రిష్ణ గారు చాలా ఇబ్బంది పడ్డారు.. ఆ పాత్ర వలనే ఆ సినిమా సూపర్ హిట్ అయింది..అందుకే ఆ తర్వాత ఎన్ని సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసినా అనవసరంగా చేసానేమో అనిపించేది..కానీ మౌనపోరాటం సినిమా విషయంలో మాత్రం నా నిర్ణయం సరైందే అనిపిస్తుంది” అంటూ చెప్పింది యమున.

సాధారణంగా గిరిజన మహిళలు జాకెట్ ధరించరు..ఇప్పుడు పరిస్థితులు మారాయి కాని ఒకప్పుడు ఇది సర్వసాధారణం..ఈ సినిమాలో కొన్ని చోట్ల యమున అదే విధంగా కనిపిస్తుంది .అంతేకాదు పాత్ర పరిధి మేరకు కోయవాళ్లు ధరించే డ్రెస్ లాంటిదే ధరించింది..దాంతో ఎక్స్పోజింగ్ ఎక్కువ అయినట్టుగా కొందరికి తోస్తుంది.. భానుచందర్ ,అర్చన నటించిన నిరీక్షణ సినిమాలో కూడా అర్చన సినిమా ఆద్యంతం జాకెట్ ధరించకుండా, తన చీరకొంగుతో మాత్రమే శరీర పై భాగాన్ని కప్పి ఉంచుతుంది.


End of Article

You may also like