Ads
మన ఇండస్ట్రీలో హీరోలు కొంతమంది తమ తండ్రులు వేసిన బాటలో నడిచి ఎంతో కష్టపడి తమకంటూ ఒక గుర్తింపు సంపాదించింది తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. అదేవిధంగా చాలామంది యాక్ట్రెస్ లు కూడా తమ తల్లులు నుండి వచ్చిన నటన వారసత్వాన్ని కొనసాగిస్తూ తల్లికి తగ్గ తనయ అనిపించుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే.
Video Advertisement
#1 శృతిహాసన్, అక్షర హాసన్ – సారిక
శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడు అనే విషయం అందరికీ తెలుసు. అలాగే శృతి హాసన్, అక్షర హాసన్ తల్లి సారిక కూడా నటి. సారిక ఎన్నో హిందీ చిత్రాల్లో నటించారు.
#2 కీర్తి సురేష్ – మేనక
కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కుమార్ ఎన్నో మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించారు. తెలుగులో పున్నమి నాగు, ఇంద్ర ధనుస్సు, సుబ్బారావుకి కోపం వచ్చింది సినిమాల్లో నటించారు. సినిమాలే కాకుండా ఎన్నో మలయాళం, ఒక తమిళ్ సీరియల్స్ కూడా చేశారు. అలాగే కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా బాధ్యతలు వ్యవహరించారు.
#3 గాయత్రీ రావు – బెంగళూరు పద్మ
హ్యాపీ డేస్ లో అప్పు పాత్రలో నటించిన గాయత్రి మీకు గుర్తుండే ఉంటుంది. తర్వాత ఆరెంజ్, గబ్బర్ సింగ్, గంగపుత్రులు సినిమాలో నటించింది. గాయత్రి తల్లి పద్మ కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో సహాయ పాత్రల్లో నటించారు. హ్యాపీ డేస్ సినిమా లో కూడా నిఖిల్ తల్లి పాత్ర పోషించారు.
#4 ఐశ్వర్య – లక్ష్మి
పరిచయం అక్కర్లేని నటులు వీళ్ళు ఇద్దరు. లక్ష్మీ గారు నరసింహ, నిన్నే పెళ్ళాడుతా, మురారి, చింతకాయల రవి, ఓ బేబీ, మన్మధుడు 2 ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఐశ్వర్య కూడా నాని, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ వంటి సినిమాల్లో నటించారు.
#5 నైనిక – మీనా
బాలనటిగా కెరీర్ ను ప్రారంభించి 90 కాలంలో దాదాపు అందరూ హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గుర్తింపును సంపాదించారు మీనా. మీనా కూతురు నైనిక కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగు పెట్టింది. విజయ్ నటించిన డబ్బింగ్ సినిమా పోలీసోడు లో విజయ్ కూతురు గా నటించింది నైనిక.
#6 ట్వింకిల్ ఖన్నా – డింపుల్ కపాడియా
రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ఖన్నా. రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా ఇద్దరూ నటులే. డింపుల్ కపాడియా కూడా ఎన్నో హిందీ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు కూడా ఎన్నో చిత్రాల్లో సహాయ పాత్రలు పోషిస్తున్నారు.
#7 జయలక్ష్మి – శ్వేత
జయం సినిమాలో హీరోయిన్ సదా చెల్లి పాత్రలో నటించారు శ్వేత. ఆ తర్వాత ప్రేమలేఖ రాశా అనే సినిమాలో కూడా నటించారు. శ్వేత తల్లి జయలక్ష్మి కూడా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు.
#8 కాజోల్, తనీషా – తనుజ
దాదాపు ఆరు దశాబ్దాల నుండి హిందీ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పాత్రలు పోషించారు తనూజ. సినిమాల్లోనే కాకుండా 3 హిందీ సీరియల్స్ లో కూడా నటించారు.
#9 కొంకణ సేన్ శర్మ – అపర్ణ సేన్
హిందీ నటి కొంకణాసేన్ శర్మ తల్లి అపర్ణ సేన్ కూడా బెంగాలీ నటి. అపర్ణ మంచి నటి మాత్రమే కాకుండా స్క్రీన్ రైటర్, దర్శకురాలు కూడా. అపర్ణ జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను పొందారు. అంతేకాకుండా అపర్ణ సినిమా ఇండస్ట్రీలో చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం అపర్ణ ను పద్మశ్రీతో సత్కరించింది.
#10 సారా అలీ ఖాన్ – అమృతా సింగ్
సారా అలీ ఖాన్ తండ్రి సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో అనే సంగతి అందరికీ తెలిసిందే. తల్లి అమృతాసింగ్ కూడా ఎన్నో హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ఇప్పుడు కూడా చాలా చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
End of Article