విజయ్ దేవరకొండ “లైగర్” కొత్త పోస్టర్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..? ఈ పోస్టర్ అర్థం ఏంటంటే..?

విజయ్ దేవరకొండ “లైగర్” కొత్త పోస్టర్ వెనుక… ఇంత పెద్ద కథ ఉందా..? ఈ పోస్టర్ అర్థం ఏంటంటే..?

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది.

Video Advertisement

ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

vijay devarakonda to have this problem in liger

అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఒకటి ఇటీవల విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ గులాబీ పూలు పట్టుకుని నిల్చుని ఉన్నారు. ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. “అసలు ఇలాంటి పోస్టర్ ఎలా విడుదల చేశారు?” అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ఈ పోస్టర్ వెనకాల పెద్ద కథ ఉంది. అదేంటంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగుతుంది. సినిమా మొత్తం యు ఎఫ్ సి (అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ షిప్) కాన్సెప్ట్ మీద నడుస్తుంది. దాని ప్రకారం నిజంగా ఎలా అయితే ఉంటుందో సినిమాలో కూడా మనకు అలాగే చూపించడానికి సినిమా బృందం ప్రయత్నిస్తున్నారు.

puri 2

అక్కడ ఒక మనిషి బరువుని కొలిచేటప్పుడు అలాగే కొలుస్తారు. ఆడవారికైనా మగవారికైనా సరే ఇలాగే బరువుని కొలుస్తారు. సినిమా ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించింది కాబట్టి, నిజంగా ఎలాగైతే జరుగుతుందో సినిమాలో కూడా అలాగే చూపించాలి కాబట్టి, పోస్టర్ కూడా అలాగే విడుదల చేశారు. సినిమా కాబట్టి కొంచెం క్రియేటివ్ గా చూపించాలి కాబట్టి విజయ్ దేవరకొండ గులాబీ పూలు పట్టుకున్నట్టు మనకు చూపించారు. కానీ పోస్టర్ చూసి కూడా నెగిటివ్ కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. కానీ సినిమాలో ఉన్న కథకు సంబంధించి అయితే ఈ పోస్టర్ సినిమాలో ఒక భాగం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


End of Article

You may also like