Home Filmy Adda “పునీత్ రాజ్‌కుమార్” గొప్పదనం గురించి చెప్పిన అదా శర్మ.! పునీత్ కి అవి సరిపడకపోయినా కూడా..?

“పునీత్ రాజ్‌కుమార్” గొప్పదనం గురించి చెప్పిన అదా శర్మ.! పునీత్ కి అవి సరిపడకపోయినా కూడా..?

by Mohana Priya

కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కిందపడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు. చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు.

adah sharma about puneeth rajkumar

పునీత్ చెన్నైలో పుట్టారు. తనకి ఆరు సంవత్సరాల వయసున్నప్పుడు కుటుంబమంతా మైసూర్ కి వెళ్ళిపోయారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ గారు కన్నడ స్టార్ హీరో. పునీత్ తన తోబుట్టువులు అందరిలో చిన్నవారు. పునీత్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టారు.దాదాపు 20 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఉత్తమ బాల నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు. 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.

adah sharma about puneeth rajkumar

పునీత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హీరోయిన్ అదా శర్మ పునీత్ తో కలిసి రాణా విక్రమ అనే సినిమాలో నటించారు. పునీత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన అదా శర్మ, పునీత్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. “నేను పనిచేసిన వారిలో చాలా మంచి వ్యక్తి పునీత్. పునీత్ కి ఒక పువ్వు సరిపడదు. ఆ పువ్వు పేరు నాకు గుర్తులేదు. కానీ పునీత్ ఫ్యాన్స్ ఆ పూలతో చేసిన దండని పునీత్ కోసం తీసుకొచ్చారు. పునీత్ ఆ దండలని వేయించుకున్నారు. పునీత్, “వాళ్లు నన్ను చూడడానికి చాలా దూరం నుండి వచ్చారు. వారిని నిరాశపరచడం బాగోదు” అని అన్నారు.” అని అదా శర్మ పేర్కొన్నారు.

You may also like