Home Filmy Adda Crazy Fellow Review : “ఆది సాయి కుమార్” నటించిన క్రేజీ ఫెలో హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Crazy Fellow Review : “ఆది సాయి కుమార్” నటించిన క్రేజీ ఫెలో హిట్టా..? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya
  • చిత్రం : క్రేజీ ఫెలో
  • నటీనటులు : ఆది సాయి కుమార్, దిగంగనా సూర్యవంశీ, మిర్నా మీనన్.
  • నిర్మాత : కె.కె.రాధామోహన్
  • దర్శకత్వం : ఫణి కృష్ణ సిరికి
  • సంగీతం : ఆర్ ఆర్ ధ్రువన్
  • విడుదల తేదీ : అక్టోబర్ 14, 2022

crazy fellow movie review

స్టోరీ :

నాని (ఆది సాయికుమార్) అనే ఒక యువకుడు, బాలా త్రిపుర సుందరి (దిగంగనా సూర్యవంశీ) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అలాగే నాని మరొక అమ్మాయిని కూడా ప్రేమిస్తాడు. అప్పుడే సమస్యలు మొదలవుతాయి. అసలు నాని ఇద్దరు అమ్మాయిలని ఎందుకు ప్రేమించాడు? ఈ విషయం ఆ అమ్మాయిలకి తెలుస్తుందా? తర్వాత ఏమవుతుంది? నాని ఇలా చేయడానికి వెనుక కారణం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

crazy fellow movie review

రివ్యూ :

గత కొంత కాలం నుండి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆది సాయికుమార్. డిఫరెంట్ కథలని, అలాగే ముందు సినిమాకి నెక్స్ట్ సినిమాకి సంబంధం లేకుండా ఉండే పాత్రలు ఎంచుకుంటూ ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. గత సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన ఆది సాయి కుమార్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటించారు. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక లవ్ స్టోరీ గా రూపొందింది.

crazy fellow movie review

కానీ ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథలో ఎంచుకున్న పాయింట్ బాగున్నా కూడా చూపించడంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ అయితే చాలా అయోమయంగా అనిపిస్తాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది సాయికుమార్ తన పాత్రకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ తో నటించారు. హీరోయిన్స్ ఇద్దరు ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా బాగుంది. అసలు ఒక్క సీన్ కూడా బాగుంది అనుకునేలాగా అనిపించదు. సినిమా మొత్తం అలా సాగిపోతుంది అంతే. స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటుంది.

crazy fellow movie review

ప్లస్ పాయింట్స్ :

  • సాంకేతిక విలువలు

మైనస్ పాయింట్స్:

  • బలహీనమైన స్క్రీన్ ప్లే
  • సాగదీసినట్టు ఉండే సీన్స్
  • బోరింగ్ కామెడీ
  • కథలో లోపించిన కొత్తదనం
  • పాత్రలు రాసుకున్న విధానం

రేటింగ్ :

2/5

ట్యాగ్ లైన్ :

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా, ఏదో ఒక సినిమా చూద్దాం అనుకునే వారికి కూడా క్రేజీ ఫెలో సినిమా సహనానికి పరీక్ష పెడుతుంది.

You may also like