Ads
- చిత్రం : తీస్ మార్ ఖాన్
- నటీనటులు : ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్, పూర్ణ.
- నిర్మాత : నాగం తిరుపతి రెడ్డి
- దర్శకత్వం : కళ్యాణ్ జీ గోగాన
- సంగీతం : సాయి కార్తీక్
- విడుదల తేదీ : ఆగస్ట్ 19, 2022
Video Advertisement
స్టోరీ :
తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పోలీస్ లాగా అవ్వాలి అనుకుంటాడు. తర్వాత పోలీస్ అయ్యే సమయానికి అతను కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఒక మాఫియాకి చెందిన వ్యక్తి తీస్ మార్ ఖాన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తర్వాత తీస్ మార్ ఖాన్ తన సోదరిని, తన సోదరి భర్తని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? తీస్ మార్ ఖాన్ తనని ఇంత ఇబ్బంది పెట్టిన వారిపై పగ తీర్చుకుంటాడా? చివరికి పోలీస్ అవుతాడా? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ప్రముఖ నటుడు సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆది సాయికుమార్ తర్వాత ఎంతో కష్టపడి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాకి వేరియేషన్ ఉండేలాగా చూసుకుంటారు. ఈ సినిమా కూడా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు ఉంటాయి. కథ, కథనం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఆది సాయికుమార్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి.
సినిమా మొత్తం ఆది సాయికుమార్, తన సోదరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనే విషయం మీద నడుస్తుంది. కానీ ఇలాంటి కథ మనం అంతకుముందు చాలా సినిమాల్లో చూశాం. హీరోయిన్ పాయల్ రాజ్పుత్ పాత్ర చిత్రీకరించిన విధానం కూడా కమర్షియల్ సినిమా టెంప్లేట్ హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది. పాటలు కూడా ఏదో సందర్భం లేకుండా వచ్చినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా సినిమా బాగానే ఉంది. కానీ సినిమాకి ముఖ్యమైన కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- నిర్మాణ విలువలు
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- రొటీన్ కథ
- బోరింగ్ సీన్స్
- అవసరం లేకుండా వచ్చే పాటలు
- బలహీనమైన కథనం
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
టెక్నికల్ గా సినిమా బాగున్నా కూడా కథ విషయంలో కొత్తదనం లోపించింది. కమర్షియల్ సినిమాలని ఎంజాయ్ చేసే వాళ్లకి తీస్ మార్ ఖాన్ ఒక్కసారి చూడగలిగే సినిమా అవుతుంది.
End of Article