ఊహించని విధంగా “ఆదిపురుష్” కలెక్షన్స్..! ఇంత పెద్ద సినిమా పరిస్థితి కూడా ఇలా..?

ఊహించని విధంగా “ఆదిపురుష్” కలెక్షన్స్..! ఇంత పెద్ద సినిమా పరిస్థితి కూడా ఇలా..?

by Mohana Priya

Ads

కంటెంట్ లేకపోతే పెద్ద సినిమా అయినా సరే మనుగడ కష్టమని ఆదిపురుష్ మరోసారి నిరూపించింది. రాముడి కథ ఆధారంగా రామాయణాన్ని తెరకెక్కించడంలో ఓం రౌత్ తీవ్రంగా విఫలమయ్యాడు. భారీ బడ్జెట్ తో, విజువల్ హంగులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అనుకున్న మూవీ కాస్త ప్రస్తుతం వివాదాల మధ్యలో చిక్కుకుంది.

Video Advertisement

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించిన ఈ చిత్రం మొదటి మూడు నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ తరువాత ఖాళీ థియేటర్ లతో వెలవెలబోతోంది. సినిమా హిట్ అవుతుంది తమకు మంచి కలెక్షన్స్ తెస్తుంది అని ఆశించి చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ మరియు సినిమా థియేటర్ యజమానులు ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయి ఉన్నారు.

అయితే మరోపక్క మూవీ నిర్వాహకులు మాత్రం మూవీ విడుదలై 10 రోజులు పూర్తవుతున్న సందర్భంగా 450 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది అని పోస్టర్లు వేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియాలో ఈ చిత్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామాయణంలోని పాత్రలను అవమానించే విధంగా ఈ చిత్రం యొక్క స్క్రీన్ ప్లే మరియు డైలాగ్ డెలివరీ ఉంది అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

minus points in adipurush trailer
దేశమంతా వెల్లువెత్తుతున్న నిరసనల కారణంగా ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయడమే కాకుండా ఈ మూవీ యొక్క డైరెక్టర్, నిర్మాత మరియు మాటల రచయిత మీద కేస్ బుక్ చేయాలని ఏకంగా సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షాకు లేఖ రాశారు. విడుదలైన మొదటి మూడు రోజుల్లో 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం గత వారం రోజుల్లో మాత్రం 58 కోట్లతో సరిపెట్టుకుంది. ఇక ముందు రోజుల్లో ఈ మాత్రం వసూళ్లు కూడా కష్టమని అంచనా.


End of Article

You may also like