“ఆదిపురుష్” OTT రిలీజ్ డేట్ అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

“ఆదిపురుష్” OTT రిలీజ్ డేట్ అప్పుడేనా..? ఎందులో స్ట్రీమ్ అవుతుంది అంటే..?

by Mohana Priya

Ads

జూన్ 16న భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి మూడు రోజులు కలెక్షన్స్ మరియు బుకింగ్స్ తో కలకలలాడిన ఈ చిత్రం ఆ తరువాత పలు రకాల వివాదాలతో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ గురించి ఒక న్యూస్ లీక్ అయింది.

Video Advertisement

ఆదిపురుష్ మేనియా అంటూ మొదలైన ఈ చిత్రం కాస్త పాజిటివ్ నుంచి నెగిటివ్ టాక్ కి సులభంగా చేరుకుంది. రెండు మూడు నెలల నుంచి ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూసిన ప్రేక్షకులు… చరిత్రను పూర్తిగా మార్చి చూపించడంతో థియేటర్లకు వెళ్లడానికే నిరాకరించే పరిస్థితి ఏర్పడింది.

adipurush-trolling

ఒకవైపు విమర్శలు వెల్లువెత్తుతున్న ఎక్కడో ఒక దగ్గర కలెక్షన్స్ జరుగుతూనే ఉండడంతో ప్రస్తుతం ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ లో మరో మైలురాయిని చేరుకుతుంది. బాహుబలి, బాహుబలి 2, సాహో చిత్రాల తరువాత మూడు మిలియన్ల డాలర్ల మార్కును దాటిన నాలుగవ చిత్రంగా ఆదిపురుష్ ప్రభాస్ కెరియర్ లో నిలిచింది.

ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రావణుడు మరియు ఆంజనేయ స్వామికి సంబంధించిన డైలాగ్స్ మరియు కొన్ని సందర్భాలు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండడంతో ఈ చిత్రంపై నిరసన వ్యక్తం అవుతోంది.

Adipurush

కొంతమంది థియేటర్‌కు వెళ్లి చూడడం అనవసరం… ఓటీటీ రిలీజ్ అయినప్పుడు చూడొచ్చులే అనంత లైట్‌గా ఈ మూవీ ని తీసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆగస్టు 15న ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు జరుపుతున్నారు. కంటెంట్ సరిగ్గా లేకపోతే ఎంత పెద్ద చిత్రం అయినా ప్రేక్షకులను మెప్పించలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఏమో.


End of Article

You may also like