“అసలు ఈ 2 సీన్స్ ఏంటి…?” అంటూ… “ఆదిపురుష్” పై ట్రోల్స్..! అవి ఏంటంటే..?

“అసలు ఈ 2 సీన్స్ ఏంటి…?” అంటూ… “ఆదిపురుష్” పై ట్రోల్స్..! అవి ఏంటంటే..?

by kavitha

Ads

ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ జూన్ 16న రిలీజ్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన అన్ని థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి మొదటి షో నుండి కొందరు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.

Video Advertisement

కానీ మరికొందరు ఈ మూవీ పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాలోని కొన్ని సన్నివేశాల పై సామాజిక మధ్యమాలలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు సీన్లను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. ఆ రెండు సీన్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Adipurushఆదిపురుష్ మూవీలో ఎక్కువగా ట్రోల్ అవుతున్నది రావణాసురిడి పాత్ర. ఈ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. రావణాసురుడికి పది తలలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రావణాసురుడికి ఉండే పది తలలు ఒకే వరుసలో ఉండకుండా రెండు వరుసలలో ఐదు తలల చొప్పున కనిపిస్తాయి. minus points in adipurush trailerఈ సీన్ ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రాఫిక్స్ లేని కాలంలో కూడా పది తలల రావణాసురిడిని చక్కగా చూపించారని, గ్రాఫిక్స్ ను సరిగా వాడలేదని అంటున్నారు. ఇక రెండవ సన్నివేశం ఏమిటంటే, అయోధ్యలో రాముడు తన తండ్రి దశరథునితో మాట్లాడే సన్నివేశం. ఈ సీన్ లో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా కనిపించాడు. తెల్లటి వస్త్రాల ధరించి, జట్టును వదిలేసి డిఫరెంట్ గా కనిపించారు.  ఈ సన్నివేశం పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు. ఈ గెటప్ ట్రైలర్ లో లేదా ఎక్కడ కూడా కనిపించలేదు. డైరెక్ట్ థియేటర్ లో చూసిన ప్రేక్షకులు ఇంకా నిరాశ చెందారు. కొందరు ప్రభాస్ దశరధుడి పాత్రలో కూడా నటించారని అంటున్నారు. కానీ ప్రభాస్ రాముడి పాత్రలో మాత్రమే నటించాడు.

https://www.instagram.com/reel/CtinVB1pVfh/?igshid=MzRlODBiNWFlZA%3D%3D

Also Read: ఆదిపురుష్ సినిమాలో “సైఫ్ అలీఖాన్” లాగానే… సినిమాల్లో “రావణుడి” పాత్ర పోషించిన 10 యాక్టర్స్..!


End of Article

You may also like