Ads
Tollywood: అడివి శేష్‘మేజర్’తో సినిమా పాన్ ఇండియా స్టార్ గా మారాడు. తాజాగా ‘హిట్2’ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పాన్ ఇండియా సినిమాల గురించి అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Video Advertisement
అడవి శేష్ క్షణం,ఎవరు, గూఢచారి లాంటి హిట్ చిత్రాలతో థ్రిల్లర్ మూవీస్ తో వాటికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఈ సంవత్సరం వచ్చిన ‘మేజర్’ మూవీ అడవి శేష్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమా బాలీవుడ్ లోను హిట్ గా నిలిచింది. ‘మేజర్’ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత అవడం కూడా బాగా కలిసొచ్చింది.అయితే తాజాగా మరో సస్పెన్స్ థ్రిల్లర్ తో సిద్ధమయ్యారు. ‘హిట్’ డైరెక్టర్ శైలేష్ దర్శకత్వంలో అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘హిట్ 2’.
ఈ సినిమా నాని నిర్మాణంలో వస్తోంది. ‘హిట్2’ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నాడు. ఇటీవలే ‘హిట్2’ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. వీటిలో భాగంగా అడవి శేష్ పాన్ ఇండియా విడుదల పై, పాన్ ఇండియా ఇమేజ్ పై కూడా మాట్లాడాడు. అయితే ప్రస్తుతం అడవి శేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అతను మాట్లాడుతూ ‘హిట్2’ సినిమాని పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయమనీ నార్త్ ప్రేక్షకులు కోరడంతో, నాని గారితో మాట్లాడి పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయబోతున్నాం.
అడగగానే అంగీకరించిన నాని గారికి, ప్రశాంతి గారికి చాలా థాంక్స్ చెప్తున్నాను. అన్నపూర్ణ బ్యానర్లో 2 సినిమాలు చేయబోతోన్నాను. ఆ సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలే అని చెప్పారు. మహేష్ బాబు గారే మేజర్ సినిమాతో నన్ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టారు.నేను ఇక్కడ ఉంటూ పాన్ ఇండియన్ మూవీస్ చేస్తాను. ఇంకా చెప్తూ కథలోనే పాన్ ఇండియా ఉండాలి. కానీ ఇమేజ్ ఉంది అని తీసే ప్రతి మూవీని పాన్ ఇండియాగా విడుదల చేయకూడదు అని చెప్పుకొచ్చాడు.
ఇక ‘హిట్2’ మూవీ డిసెంబర్ 2వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.ఈ క్రమంలో చిత్రా యూనిట్ పెద్ద ఎత్తున మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్,రావురామేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
End of Article