Ads
డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుల కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలామంది బాదం పప్పు ని రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు పొద్దున తీసుకుంటారు. అలా చేస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది అని అంటారు. ఇదొక్కటే కాకుండా బాదంపప్పు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే.
Video Advertisement
#1 బాదాంలో మోనో అన్శాచురేటెడ్ యాసిడ్స్ ఉన్నాయట. అవి ఒక రకమైన ఫ్యాటి యాసిడ్స్ అట. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయట. దానివల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావట.
#2 బాదాంలో మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం, కాపర్, మాంగనీస్, అర్జినైన్ ఉంటాయట. అంతేకాకుండా బాదాంలో లో డెన్సిటీ లైపోప్రోటీన్ (LDL) కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణాలున్నాయట. బాదం తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయట.
#3 బాదంలో విటమిన్ ఇ ఉంటుంది దాని వల్ల చర్మానికి కూడా ఎన్నో లాభాలు ఉన్నాయట. యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని యు వీ రేస్ నుండి, పొల్యూషన్ నుండి కాపాడతాయి. అలాగే స్కిన్ క్యాన్సర్ కూడా రాదు. చాలామంది సమయం లేక, లేదా ఇంకేదైనా కారణం వల్ల తమ చర్మానికి సరైన జాగ్రత్తలు తీసుకోరు. దాంతో చర్మ సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి.
తరచుగా బాదం తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువగా కనిపించవు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. బాదం నూనె వాడటం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందట.
#4 సాధారణంగా చాలామంది బాదం పొట్టు తోనే తింటారు. కానీ బాదం అలా పొట్టుతో తినకూడదట. నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టి పొట్టు తీసేసి అప్పుడు బాదం తినాలట. అలా అయితే శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయట. చలికాలంలో అయితే రోజుకి 5- 6 బాదం పప్పులు తినాలట. వేసవి కాలంలో అయితే 3-4 బాదం పప్పులు తీసుకోవాలట.
#5 బాదం వల్ల శరీరంలో వున్న గ్లూకోజ్ లెవెల్ బాలన్స్ అవుతుందట. అంతేకాకుండా బ్లడ్, షుగర్ లెవెల్స్, ఇంకా డయాబెటిస్ కూడా కంట్రోల్ లో ఉంటుందట.
#6 బాదం లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుందట. దానివల్ల అతిగా తినడం నియంత్రించవచ్చట. దానివల్ల బరువు కూడా తగ్గుతారట. అందుకే చాలామంది స్నాక్ రూపంలో కూడా బాదం తీసుకుంటూ ఉంటారు.
#7 బాదం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందట. అంతేకాకుండా బాదం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయట. దాంతో ఎముకలకి సంబంధించిన ఫ్యాక్చర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయట. ఇంకా పళ్ళు కూడా పాడుకాకుండా బాదం కాపాడుతుందట.
End of Article