Ads
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించిన విషయం తెలిసిందే. దాంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. అందులో ఆయనకు ప్రత్యేకమైన గదిని, వసతులను కోర్టు ఆదేశాల ప్రకారం కేటాయించారు.
Video Advertisement
అయితే అంతకు ముందు ఈ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో వాదప్రతి వాదనలు హోరాహోరీగా జరిగాయి. సీఐడీ తరఫు వాదనలు అయిన తరువాత మాజీ సీఎం చంద్రబాబు తరఫున ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో శనివారం తెల్లవారుజామున నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి, 24 గంటలు పూర్తి అయ్యే సమయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు పోలీసులు విజయవాడ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరుఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా గంటకు పైగా వాదించారు. ఆయన వాదన మొదలవగానే కోర్టు లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ప్రభుత్వం, సీఐడీ ఆఫీసర్లను లూథ్రా అడిగిన ప్రశ్నలకు కోర్టు అంతా సైలెంట్ గా మారింది. సీఐడీ లాయర్లు అయితే అలా చూస్తుండిపోయారంట. ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమిటి? ఎప్పుడు ఇది జరిగింది? అంటూ ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో లూథ్రా ప్రశ్నలను లేవనెత్తారు. అది మాత్రమే కాకుండా గతంలోని కొన్ని కేసులను కూడా ఉదహరణగా చెప్పారట. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం, లూథ్రా అడిగిన కీలక విషయాలు ..
- 2021లో రిజిస్టర్ అయిన ఈ కేసులో హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.
- స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు రాజకీయ ప్రేరేపితం
- తీర్పు సైతం రిజర్వ్ అయ్యింది. ఈ కేసు ఇంతకుముందే ముగిసింది. ఆ కేసులో నిందితులు అందరికీ బెయిల్ కూడా వచ్చింది.
- ఎలెక్షన్స్ వస్తున్నాయని, చంద్రబాబును ఇరికించడానికే మళ్ళీ ఈ కేసును ఓపెన్ చేశారు.
- చంద్రబాబు నాయుడి పై చేసినవి అన్ని ఆధారాలు లేని ఆరోపణలు.
- గవర్నమెంట్ చంద్రబాబును లక్ష్యంగా చేసుకుంది.
- సెక్షన్-409 చంద్రబాబు నాయుడికి వర్తించదు.
- ఏ-35 గా ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌ను అరెస్ట్ చేసిన టైమ్ లో సెక్షన్-409 వర్తించదు
- చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్‌లో లేదు. అలాంటప్పుడు ఎలా సీఐడీ అరెస్ట్ చేస్తుంది?
- రిమాండ్ రిపోర్టులో ఎంక్వైరీ ఆఫీసర్ ఉపయోగించిన భాషను గమనించండి.
- చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం వాళ్లనుకున్న దగ్గరే ప్రవేశపెట్టింది.
- కోర్టు ముందు చంద్రబాబును ప్రవేశపెట్టకుండా 24 గంటల వరకు ఎందుకు నిర్భందించారో అనేది అర్థం కావట్లేదు?
- సీఐడీ ఆరోపిస్తున్నట్లుగా చంద్రబాబు నాయుడు లండన్ వెళ్లడం లేదు.
- చంద్రబాబును పొద్దున 6 గంటలకు అరెస్ట్ చేశామని సీఐడీ అంటోంది. కానీ శనివారం రోజు రాత్రి 11 గంటలకే చంద్రబాబును సీఐడీ అధికారులు చుట్టుముట్టారు.
- అప్పటి నుండే అరెస్ట్ చేసినట్టుగా చూడాలి.
- రాత్రి 11 గంటలకు పోలీసులు చంద్రబాబును చుట్టుముట్టి, కదలకుండా చేయడం అనేది వ్యక్తిగత హక్కులను భంగపరచడమే.
- సీఐడీ పోలీసుల కాల్ డేటా రికార్డులను ఇచ్చేలా కోర్టు ఆర్డర్స్ ఇవ్వాలి.
- అలాగే చంద్రబాబును అరెస్టు చేసిన అధికారుల 48గంటల కాల్ డేటా కూడా కోర్టులో సమర్పించాలి.
- అవినీతి నిరోధక చట్టంలో ఉన్నట్టుగా సీఐడీ పోలీసులు నడుచుకోలేదు.
- చంద్రబాబు అరెస్ట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం.
- రిమాండ్ రిపోర్టు వరకు వాదనలు పరిమితం చేయాలని లూథ్రా వాదించారు.
End of Article