Ads
నిన్న చెన్నై వేదికగా జరిగిన ఆఫ్గనిస్తాన్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తమకంటే బలహీనమైన జట్టు ఆఫ్గనిస్తాన్ పైన పాకిస్తాన్ ఓడిపోవడంతో నెట్టింట అభిమానులు పాకిస్తాన్ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
Video Advertisement
పాకిస్తానీ క్రికెటర్లు హైదరాబాద్ బిర్యానీ తినడానికి తప్ప క్రికెట్ ఆడడానికి పనిచేయరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది సరిపోదన్నట్టు చచ్చిన పాముని మళ్లీ లేపి చంపినట్టు ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ పాకిస్తాన్ మీద వేసిన కౌంటర్లు వైరల్ అవుతున్నాయి.
ఆఫ్గనిస్తాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ “నేను ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను పాకిస్తాన్ నుండి బలవంతంగా వెళ్ళగొట్టిన ఆఫ్గనిస్తాన్ ప్రజలకు అంకితం చేస్తున్నాను” అని అన్నాడు. దీంతో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నేను పాజిటివ్ మైండ్ తోనే బ్యాటింగ్ కు దిగాను. గుర్బాజ్ తో నాకు మంచి అవగాహన ఉంది ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అది బాగా ఉపయోగపడుతుంది. మేము అండర్ 16 నుంచి కలిసి ఆడాం. మైదానంలో గుర్బాకు నాకు అండగా ఉన్నాడు మ్యాచ్ మావైపు తిప్పుకోవడానికి ఇది చాలా ఉపయోగపడింది ఈ విజయంతో నేను నా దేశం గొప్పగా ఫీల్ అవుతున్నామని అన్నాడు.
అసలు విషయానికి వస్తే తాలిబన్ల యుద్దాల కారణంగా కొన్ని లక్షల మంది ఆఫ్గాన్ వాసులు తలదాచుకోవడానికి పాకిస్తాన్ వచ్చారు. అమెరికా ఆఫ్గాన్ నుండి వెళ్ళిన తర్వాత తాలిబన్ల పాలన రావడంతో అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారింది. దీంతో పాక్ లో ఆశ్రయం పొందిన వారు ఇక్కడే శరణార్థి శిబిరాల్లో చిన్నచితికా పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. అలా జీవిస్తున్న వారి సంఖ్య 17 లక్షల పైగానే ఉంటుందని అంచనా ఈనెల మొదట్లో ప్రభుత్వం వీరందరినీ హఠాత్తుగా కాళీ చేయమని ఆదేశించింది.
నవంబర్ 1 లోపు దేశాన్ని వేడాలని పాక్ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ఇప్పటివరకు 51 వేల మందిని దేశం నుంచి పంపేసినట్లు అధికారి వర్గాల ప్రకటించాయి. ఈ పరిణామాలపై ఆఫ్గాన్ వాసుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. తాజాగా జద్రాన్ ప్రకటనతో ఆఫ్గాన్ శరణార్థులకు సంఘీభావం తెలిపినట్లు అయింది.
Also Read:సెమీస్ బర్త్ కంఫర్మ్ అవ్వాలంటే వరల్డ్ కప్ లో భారత్ ఇంకా ఎన్ని మ్యాచ్ లు నెగ్గాలి.?
End of Article