పేదరికంలో ప్రజలు ఉంటే ..ఆ దేశ రాజు తన 15 మంది భార్యలకు ఏకంగా 120 BMW కార్లను ఆర్డర్…అవి చాలవన్నట్టు

పేదరికంలో ప్రజలు ఉంటే ..ఆ దేశ రాజు తన 15 మంది భార్యలకు ఏకంగా 120 BMW కార్లను ఆర్డర్…అవి చాలవన్నట్టు

by Megha Varna

Ads

నాయకుడు బాగుంటే అక్కడి ప్రజలు బాగుంటారు.అదే నాయకుడు క్రూరంగా ఉంటే అక్కడి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారో అనే సాక్ష్యాలు చరిత్రలో అణువణువునా దర్శనమిస్తుంటాయి.ఇప్పటికీ ప్రజల కష్టాలను పట్టించుకోకుండా వాళ్ళ డబ్బును తమ విలాసాలకు వాడుకునే నాయకులు ఉన్నారని వాళ్ళ కోరలలో అక్కడి ప్రజలు ఇంకా ఇబ్బందులు పడుతున్నారని మీకు తెలుసా?

Video Advertisement

అబ్బే అప్పట్లో ఇంత సాంకేతిక పరిజ్ఞానం లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళ టైం నడచి ఉండచ్చు ఇప్పుడు అంత సీన్ లేదులే అనుకుంటున్నారా?అయితే ఈ కథనం చూడండి దాని తర్వాత మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు.సౌత్ ఆఫ్రికాలో స్వాజీల్యాండ్ అనే దేశం ఉంది.ఇక్కడ ఇప్పటికీ రాజుల పరిపాలన జరుగుతుంది.

ఇక్కడి ప్రజలు ఇప్పటికీ పేదరికంతో మగ్గుతున్నారు.ఇవి ఏమి పట్టించుకోని ఆ దేశపు రాజు మస్వతి తన 15 మంది భార్యలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.అంతే కాకుండా ఇతని దగ్గర 1.9 కోట్ల విలువ చేసే 19 రోల్స్ రాయిస్ కార్స్ ఉన్నాయి అవి చాలవన్నట్టు తాజాగా 180 కోట్ల విలువ గల 120 కార్లను 15 మంది భార్యలకు బహుమతిగా ఇచ్చాడు.ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


End of Article

You may also like