కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విషయం తెలిసిందే. కరోనా అనుమానితులు రోజరోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అయితే కరోనా పరీక్షకు కేవలం 2200 మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ ల్యాబ్ లకు సూచించింది తెలంగాణ ప్రభుత్వం.ప్రస్తుతం తెలంగాణాలో ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.

ఈ క్రమంలో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు ఆందోళన చెందొద్దు అని కెసిఆర్ హామీ ఇచ్చారు. అవసరమైతే హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించనన్నుట్టుగా ముఖ్యమంత్రి‌ తెలిపారు. హైదరాబాద్‌లో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ప్రభుత్వంపై అదే నిర్ణయం తీసుకోవాలని ఉందని కెసిఆర్ తెలిపారు. అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని , ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని తెలిపారు.

హైదరాబాద్‌ చాలా పెద్ద నగరమని , ఇక్కడ కోటి మంది నివసిస్తున్నారని కేసీఆర్‌ తెలిపారు. అన్ని నగరాల్లో మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పారు.రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, జిహెచ్ఎంసి పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని సీఎం కెసిఆర్ తెలిపారు. ఈ సారి లాక్‌డౌన్‌ విధిస్తే కఠిన అంక్షలు అమలు చేయనున్నట్టుగా సమాచారం.

Follow Us on FB:


Sharing is Caring: