64 ఏళ్ళ నాగార్జున …ఆ 26 ఏళ్ల హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఏంటి.? మరీ చిన్నపిల్లంటూ ట్రోల్స్.!

64 ఏళ్ళ నాగార్జున …ఆ 26 ఏళ్ల హీరోయిన్ తో రొమాన్స్ చేయడం ఏంటి.? మరీ చిన్నపిల్లంటూ ట్రోల్స్.!

by Harika

నాగార్జున తాజా చిత్రం నా సామిరంగా.. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కోసం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ ని చిత్ర యూనిట్ పరిచయం చేసింది. ఆమె మరెవరో కాదు అమిగోస్ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్. కన్నడలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ కి తెలుగులో రెండవది ఈ సినిమా.

Video Advertisement

నిండుగా చీర కట్టుకొని ఓర చూపు చూస్తున్న ఆమె లుక్కు సూపర్ గా ఉంది. అలాగే నాగార్జున దొంగ చాటుగా ఆమెని చూస్తున్నట్లు ఉండే గ్లిమ్స్ చాలా బాగున్నాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ అంటేనే కొంచెం ఎబ్బెట్టు గా ఉంది అంటున్నారు నెటిజెన్స్. నాగార్జున పక్కన ఆ పిల్ల మరీ చిన్న పిల్లలాగా కనిపిస్తుంది అంటూ విమర్శిస్తున్నారు నెటిజన్స్. 64 ఏళ్ళ నాగార్జున కేవలం 26 ఏళ్ల ఆశికా సరసన నటించడం ఏంటి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి, బాలకృష్ణ లు కూడా తమ సరసన నటించే హీరోయిన్ల విషయంలో పలు విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. శృతిహాసన్, చిరంజీవి జంట కూడా ఇలాగే విమర్శలపాలైంది. అలాగే బాలకృష్ణ, శృతిహాసన్ జంట కూడా ట్రోల్స్ కి గురైంది. అలాంటి ముదురు హీరోలకి కాజల్, అనుష్క, శ్రియ లాంటి వాళ్ళు నప్పుతారు కానీ మరి ఇంత చిన్న పిల్లలు వాళ్లకి అవసరమా అంటూ తెగ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.

అయితే నా సామిరంగా సినిమాకి బెజవాడ ప్రసన్నకుమార్ మాటలని అందిస్తుండగా ప్రముఖ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ప్రతాకం పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మలయాళం మూవీ పోరింజు మరియం జోష్ కి రీమేక్. ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యూజిక్ కి మ్యాజిక్ జోడించారు.


You may also like

Leave a Comment