Home Filmy Adda “అలా ఉన్న వ్యక్తి కేవలం ఒక్క అనుష్క శెట్టి మాత్రమే.!” అంటూ… వైరల్ అవుతున్న ఒక “ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్” కామెంట్..!

“అలా ఉన్న వ్యక్తి కేవలం ఒక్క అనుష్క శెట్టి మాత్రమే.!” అంటూ… వైరల్ అవుతున్న ఒక “ఎయిర్‌పోర్ట్‌ స్టాఫ్” కామెంట్..!

by Mohana Priya

అనుష్క శెట్టి అందరికీ సుపరిచితమే. 2005లో వచ్చిన సూపర్‌ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ భామ. తొలి సినిమాతోనే ఈమె బాగా ఆకట్టుకుంది. 2009లో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క కి ప్లస్ అయ్యింది. అలానే బాహుబలి చిత్రం తో కూడా మెప్పించింది అనుష్క.

కేవలం తెలుగు చిత్రాల్లోనే కాక తమిళ సినిమాల లో కూడా అనుష్క నటించి ఫ్యాన్స్ ని ఫిదా చేసేసింది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అనుష్క శెట్టి గురించి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో పని చేసే ఒకరు  ఆమె మంచితనం గురించి చెప్పారు. మరి తాను చెప్పిన విషయాలని ఇప్పుడు చూద్దాం.

ఏ నటీ కూడా మమ్మల్ని చూసి నవ్వుతూ పలకరించ లేదు. ఇప్పటి వరకూ మమ్మల్ని చూసి నవ్విన నటి అనుష్క శెట్టి అని ఎయిర్ పోర్ట్ లో పని చేసే ఒకరు చెప్పారు. పైగా ఎలాంటి గర్వం లేకుండా అనుష్క శెట్టి పలకరించాలని తను చెప్పారు.

అలానే అనుష్క లగేజీ ని తానె స్వయంగా మోసుకున్నారు అని అన్నారు. అదే విధంగా ఎంతో కూల్ గా ఎంతో సింపుల్ గా ఎలాంటి మేకప్ లేకుండా అనుష్క శెట్టి ఉన్నట్లు తాను చెప్పారు. పైగా ఆమె ధరించిన దుస్తులు కూడా ఎంతో సింపుల్ గా ఉన్నాయని ఆమె చాలా వినమ్రంగా ఉన్నారని తను చెప్పారు.

an airport staff comment on anushka shetty behavior in airport goes viral

అనుష్క శెట్టి ధరించిన డ్రెస్ ధర పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ఉండొచ్చని.. బ్లాక్ టీ తాగుతూ ఆమె విఐపిల లాంజ్ రూమ్లో కూర్చున్నారని.. ఆమె స్వయంగా సర్వ్ చేసుకున్నట్లు తన చెప్పారు.

You may also like