Ads
కరోనా సామాన్యులు, సెలెబ్రిటీలు అని తేడా లేకుండా అందరినీ టెన్షన్ పెట్టేస్తుంది.ముఖ్యంగా బాలీవుడ్ లో రోజుకొక సెలెబ్రిటీ దీని కోరలలో చిక్కుతున్నారు.తాజాగా బచ్చన్ ఫ్యామిలీలో ఒక్క జయ బచ్చన్ తప్ప మిగతా వాళ్ళందరూ ఈ కరోనా బారిన పడ్డారు.ఇప్పటికే దేశమంతా ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలలో అభిమానులు బచ్చన్ ఫ్యామిలీ ఈ కరోనా నుండి కోలుకోవాలని పూజులు నిర్వహిస్తున్నారు.
Video Advertisement
ప్రస్తుతం అందిన సమాచారం మేర హోం క్వారంటైన్ లో ట్రీట్మెంట్ అందుకుంటున్న ఐశ్వర్యరాయ్,ఆరాధ్య తాజాగా ముంబై లోని నానవతి హాస్పిటల్ లో చేరారు. ఉన్నట్టుండి ఐశ్వర్యరాయ్ కు తీవ్ర జ్వరం రావడంతో జయ బచ్చన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.ఇప్పటికే అభిషేక్,అమితాబ్ బచ్చన్ లు అక్కడ అడ్మిట్ అయి ఉన్నారు.తాజాగా ఐశ్వర్య,ఆరాధ్య కూడా అక్కడ అడ్మిట్ అవ్వడంతో వారి పరిస్థితి త్వరగా మెరుగుపడాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.
దేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్న అక్కడ కరోనా కేసులు సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు.
End of Article