Ads
కరోనా ఇప్పటికే వాణిజ్య రాజధానైన ముంబై లో రోజురోజుకీ విస్తరిస్తూ ముంబై వాసులను వణికిస్తుంది.తాజాగా కరోనా బాలీవుడ్ పరిశ్రమకు పెద్ద దిక్కైన బచ్చన్ ఫ్యామిలీని చుట్టూ ముట్టింది.ఇప్పటికే కరోనా సోకిన అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, అభిషేక్ బచ్చన్ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికత్స పొందుతున్నారు.
Video Advertisement
గత రెండుసార్లు టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన ఐశ్వర్యరాయ్ మరియు తన కుమార్తె ఆరాధ్యకు మూడో టెస్టులో పాజిటివ్ అని తేలింది.ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే స్వయంగా నిర్ధారించారు.మొత్తం బచ్చన్ కుటుంబంలో ఉన్న ఐదుగురికి టెస్ట్ లు చేయగా అందులో జయ బచ్చన్ తప్ప మిగతా అందరికీ కరోనా సోకిందని అధికారులు నిర్ధారించారు.
అభిమానులకు విషయం తెలియడంతో తామ అభిమానించే బచ్చన్ ఫ్యామిలీ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాలలో పూజలు నిర్వహించడం మొదలు పెట్టారు.
End of Article