అజిత్ “తునివు” స్టోరీ ఇదేనా..? ఆ “మహేష్ బాబు” సూపర్ హిట్ సినిమాలాగా ఉందేంటి..?

అజిత్ “తునివు” స్టోరీ ఇదేనా..? ఆ “మహేష్ బాబు” సూపర్ హిట్ సినిమాలాగా ఉందేంటి..?

by Megha Varna

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుల్లో అజిత్ ఒకరు. అజిత్ హీరోగా నటించిన అన్ని సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి. అజిత్ కి తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ ఉంది. అజిత్ హీరోగా వస్తున్న తునివు సినిమాకు సంబంధించి టాక్ నడుస్తోంది.

Video Advertisement

పెద్ద దొంగతనం మీద ఈ సినిమా బేస్ అయి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ దొంగతనంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగవని… పోలీసులు ఒక క్లీన్ ఆపరేషన్ ని చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే దొంగతనం కాన్సెప్ట్ మాత్రమే కాకుండా బ్యాంకులకు సంబంధించి కూడా టాపిక్ నడుస్తూ ఉంటుంది. లోన్ తీసుకోవడం వంటి సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి అని తెలుస్తోంది.

అయితే ట్విట్టర్ లో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతూ ఉంటే కొంత మంది నెటిజన్లు ఈ సినిమా సర్కారు వారి పాట సినిమా లాగ ఉంది అని ఈ కామెంట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన సర్కార్ వారి పాట సినిమా గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఈ సినిమా థియేటర్ల లో విడుదలయ్యింది.

రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ గా మహేష్ బాబు మరియు కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రానికి గాను పరశురాం దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గాను మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ సంస్థలు నిర్మాణ సారథ్యం వహించారు. మన సర్కారు వారి పాట చిత్రానికి థమన్ సంగీత దర్శకత్వం వహించారు.

“మహేష్ బాబు ఈ సినిమాలో చాలా బాగా నటించారు, చాలా కొత్తగా కనిపించారు” అని కొందరు అంటూ ఉంటే, ఇంకొంత మంది, “కథ లో కొత్తదనం లేదు” అంటున్నారు. మొత్తం మీద ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోస్ట్ పాండెమిక్ తరువాత ఈ సినిమా కూడా విజయం సాధించిన సినిమాల లిస్ట్ లోనే ఉంది. అయితే అజిత్ హీరోగా వస్తున్న తునివు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన  సర్కారు వారి పాట సినిమా లాగ ఉంటుందో లేదో చూడాలి.

ajith thunivu story is similar to mahesh babu super hit movie

ఇంక అజిత్ తునివు సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసారు. ఇందులో అజిత్ చాలా స్టైలిష్ గా ఉన్నారు. అజిత్ నటించిన వలిమై పాన్ ఇండియన్ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తుతం అయితే తమిళంలో విడుదల అవుతుంది. కానీ అజిత్ కి తెలుగులో కూడా చాలా క్రేజ్ ఉంది కాబట్టి తెలుగులో కూడా డబ్ చేస్తారు.


End of Article

You may also like