Ads
సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా, అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఒక డిజిటల్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది. స్టార్ హీరోల సినిమాలు కూడా ఓటీటీలో విడుదల చేస్తే ఎంత పెద్ద విజయం సాధిస్తాయో అని ఈ సినిమా నిరూపించింది.
Video Advertisement
అప్పటివరకు సూర్య వరుస ఫ్లాప్ లతో ఉన్నారు. ఈ సినిమా సూర్యకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సూర్య ఈ సినిమాలో చేసిన నటనకి జాతీయ అవార్డు ప్రకటించారు. అంతే కాకుండా ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సుధా కొంగరకి అలాగే సినిమాలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళికి కూడా జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ విషయంపై ఇటీవల సుధా కొంగర ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అందులో భాగంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని సుధా కొంగర చెప్పారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధా కొంగర మాట్లాడుతూ ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలను చెప్పారు. అందులో, “హీరోయిన్ పాత్రకి అవార్డ్ రావడం ఎలా ఉంది?” అని అడిగితే, “చాలా ఆనందంగా ఉంది. సినిమాలో హీరో పాత్రకి ఉన్నంత నిడివి హీరోయిన్ పాత్రకి లేదు. అయినా కూడా హీరోయిన్ పర్ఫామెన్స్ కి గుర్తింపు దక్కడం అనేది చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ లో వచ్చిన బెస్ట్ అవార్డు ఇది. సూర్యకి వస్తుంది అని ఆల్రెడీ మేము ఊహించాం. ఇది అసలు ఊహించలేదు” అని అన్నారు.
అలాగే ఈ సినిమాలో ఒక డైలాగ్ గురించి చాలా గొడవపడ్డారు అని కూడా చెప్పారు. ఒక సీన్ లో సూర్య పాత్ర వెళ్లి అపర్ణ బాలమురళి పాత్రని డబ్బులు అడుగుతాడు. ఆ సీన్ సుధా కొంగర వాళ్ళ టీంకి చెప్పగానే, “అసలు ఇలాంటి సీన్ వద్దు” అని అన్నారట. “చూసేవాళ్ళు ఏమనుకుంటారు?” అని ఇంకా చాలా వాదనలు వచ్చాయట. “ఇది నా సినిమా. ఇందులో నాకు నచ్చిన సీన్ ఉండాల్సిందే” అని సుధా కొంగర పట్టుబట్టి ఈ సీన్ సినిమాలో ఉండేలా చేశారు అని చెప్పారు.
Watch Video :
End of Article