Home Filmy Adda అఖండలోని “జై బాలయ్య” స్టెప్… ఈ “జూనియర్ ఎన్టీఆర్” పాట నుండి కాపీ కొట్టారా..?

అఖండలోని “జై బాలయ్య” స్టెప్… ఈ “జూనియర్ ఎన్టీఆర్” పాట నుండి కాపీ కొట్టారా..?

by Mohana Priya

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

akhanda jai balayya hook step copied from a jr ntr song

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు . ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో జై బాలయ్య పాట, అందులో బాలకృష్ణ వేసిన స్టెప్స్ కి ప్రేక్షకులు థియేటర్లలో విజిల్స్ వేశారు.

akhanda jai balayya hook step copied from a jr ntr song

అయితే ఈ స్టెప్ లాంటి స్టెప్ అంతకుముందు ఒక సినిమాలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్యా వస్తావయ్యాలో పండగ చేస్కో అనే పాటలో దగ్గర దగ్గర ఇలాంటి స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ మొత్తం ఒకేలాగా కాకపోయినా దగ్గర దగ్గర సిమిలర్ గా ఉంది. కానీ అఖండ సినిమాలో బాలకృష్ణ వేసిన స్టెప్ లో బాలకృష్ణ ముందుకు వెళ్తున్నప్పుడు షర్ట్ మారడం అనే ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేశారు.

watch video :

You may also like