Akhanda Collections : అఖండ “మొదటి రోజు” కలెక్షన్స్ ఇవే..! ఎంత రాబట్టిందంటే..?

Akhanda Collections : అఖండ “మొదటి రోజు” కలెక్షన్స్ ఇవే..! ఎంత రాబట్టిందంటే..?

by Mohana Priya

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు. మొదటి రోజు సినిమాకి భారీగా కలెక్షన్స్ నమోదయ్యాయి. అఖండ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు చూద్దాం.

akhanda

 

# నైజాం – 4.38 cr

# సీడెడ్ – 3.30 cr

# ఉత్తరాంధ్ర -1.35 cr

# ఈస్ట్ – 1.05 cr

# వెస్ట్ – 0.90 cr

# గుంటూరు – 1.87 cr

# కృష్ణా – 0.81 cr

# నెల్లూరు – 0.93 cr

# ఏపీ + తెలంగాణ (టోటల్) – 14.59 cr

# ఇండియాలో మిగిలిన చోట్లు + ఓవర్సీస్ – 3.45 Cr

# వరల్డ్ వైడ్ (టోటల్) – 18.04 cr

akhanda movie review

 

అఖండ సినిమాకి టోటల్ గా 53.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు 18.04 కోట్లు రాబట్టింది. సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 54 కోట్లు షేర్ రావాలి. అంటే బ్రేక్ ఈవెన్ కి మరో 35.96 కోట్లు రావాలి. వకీల్ సాబ్ తర్వాత మొదటి రోజు అంత ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా ఇదే. అంతే కాకుండా, బాలకృష్ణ కెరీర్‌లో కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన సినిమాగా అఖండ నిలిచింది. ప్రస్తుతం అయితే అఖండ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.


End of Article

You may also like