“అఖండ” పార్ట్ -2 కథ ఇదేనా..? సీక్వెల్‌లో ఏం చూపించబోతున్నారంటే..?

“అఖండ” పార్ట్ -2 కథ ఇదేనా..? సీక్వెల్‌లో ఏం చూపించబోతున్నారంటే..?

by Mohana Priya

Ads

సింహ, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడవ సినిమా అఖండ. దాంతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అసలు ముందే రావాల్సిన అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో వారిద్దరూ హ్యాట్రిక్ విజయం సాధిస్తారేమో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Video Advertisement

సినిమాకి ముఖ్య హైలెట్ మాత్రం బాలకృష్ణ. రెండు పాత్రల్లో, అది కూడా ముఖ్యంగా అఖండ పాత్రల్లో బాలకృష్ణ చాలా పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అఖండ మొదటి షో అయిన తర్వాత నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాతో వారిద్దరు హ్యాట్రిక్ విజయం సాధించారు అని అంటున్నారు.

balayya-babu-akhanda-news

అఖండ సినిమాలో మురళీ కృష్ణగా, అఖండగా రెండు పాత్రల్లో నటించారు బాలకృష్ణ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు . ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ పాయింట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండకి పార్ట్ 2 కూడా ఉంటుంది అని బోయపాటి శ్రీను ఇటీవల చెప్పారు. ఒకవేళ కుదిరితే అఖండ పార్ట్ 2 సినిమా కచ్చితంగా తీస్తాము అని అన్నారు. అయితే, ఒకవేళ ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటే ఆ స్టోరీ ఇలా ఉంటుంది అనే వార్త ప్రచారంలో ఉంది.

Akhanda movie trolls

మొదటి భాగంలో తన తల్లి నుండి వేరు అయిన అఖండ ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, తాను పెరిగి పెద్దయ్యే క్రమంలో జరిగిన సంఘటనలు ఏంటి అనే విషయంపై ఈ సినిమా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అలాగే అఖండ వెళుతూ వెళుతూ మళ్లీ ఏదైనా సమస్య వస్తే తాను ఖచ్చితంగా వస్తాను అని చెప్తాడు. దాంతో మళ్ళీ సెకండ్ పార్ట్ లో వచ్చే ముప్పు నుండి అఖండ కాపాడతాడు అని మనకి అర్ధమైపోయింది. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కువశాతం అఖండ మీదే నడుస్తుంది. అలాగే అఘోరాల గురించి కూడా ఈ సినిమాలో వివరంగా చెప్తారు అని సమాచారం.


End of Article

You may also like