Agent Review : “అఖిల్ అక్కినేని” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Agent Review : “అఖిల్ అక్కినేని” కి మరొక హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

కొంత కాలం క్రితం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అఖిల్ అక్కినేని ఇప్పుడు మళ్లీ ఏజెంట్ సినిమాతో చాలా సమయం తీసుకొని ప్రేక్షకులని అలరించడానికి వచ్చారు. సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : ఏజెంట్
  • నటీనటులు : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి.
  • నిర్మాత : అనిల్ సుంకర
  • దర్శకత్వం : సురేందర్ రెడ్డి
  • సంగీతం : హిప్ హాప్ తమిళ
  • విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023

స్టోరీ :

సినిమా మహదేవ్ (మమ్ముట్టి) అనే ఒక చీఫ్ తో మొదలవుతుంది. మహదేవ్ ఒక మిషన్ మీద ఉంటారు. గాడ్ (డినో మోరియా) అనే ఒక డాన్ ని పట్టుకోవాలి అనుకుంటారు. దీని కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే సమయంలో రామకృష్ణ (అఖిల్ అక్కినేని) అనే ఒక హ్యాకర్ మహదేవ్ తో కలిసి వారి ఏజెన్సీలో పని చేయడానికి, మహదేవ్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రామకృష్ణ వారితో కలిశాడా? ఆ తర్వాత రామకృష్ణ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? చివరికి వారు అనుకున్న మిషన్ సాధించారా? ఇంతకీ అసలు వారు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

meems on akhil agent movie trailer..!!

రివ్యూ :

సాధారణంగా యాక్షన్ సినిమాలు అంటే ఏ ఇండస్ట్రీ ప్రేక్షకులకు అయినా సరే ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. సినిమా ట్రైలర్ చూశాక అలాంటి ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే సురేందర్ రెడ్డి స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో చాలా గుర్తింపు పొందారు. అంతకుముందు కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా కూడా సురేందర్ రెడ్డి సినిమాలు అంటే చాలా స్టైలిష్ గా ఉంటాయి, అందులో యాక్షన్ చాలా బాగుంటుంది అని అంటూ ఉంటారు.

agent movie review

అది కూడా సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబినేషన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను మార్చుకున్న తీరు కూడా అస్సలు ఊహించలేదు. దాంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ అయినా కూడా జనాలకి అంత పెద్దగా ఎక్కలేదు. చాలా రొటీన్ సినిమా లాగా అనిపించింది. అఖిల్ ఈ సినిమాతో కచ్చితంగా పెద్ద హిట్ కొడతారు అని అనుకున్నారు. సినిమా చాలా వైల్డ్ గా ఉంటుంది అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. చెప్పినట్టుగానే సినిమా నిజంగానే చాలా వైల్డ్ గా ఉంది. హీరో అఖిల్ మేక్ ఓవర్ బాగుంది.

agent movie review

నిజంగా ఈ సినిమా కోసం రెండు సంవత్సరాల పాటు అఖిల్ పడిన కష్టం అంతా కూడా తెరపై కనిపిస్తోంది. అంతకుముందు అఖిల్ నటించిన సినిమాలు అన్నీ కూడా ఒక రకం అయిన టెంప్లేట్ తో సాగుతాయి. అందులో అఖిల్ అక్కినేని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే సినిమాలు అయిపోయాయి. కానీ ఈ సినిమా కోసం అఖిల్ తనని తాను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. లుక్స్ విషయం నుండి, డైలాగ్ చెప్పే విధానం వరకు ఈ సినిమాలో నిజంగానే ఒక కొత్త అఖిల్ కనిపిస్తారు. ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో అఖిల్ ఇంత హుషారుగా తెరపై కనిపించలేదు.

agent movie review

నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక యాక్షన్ సినిమాకి ఎలా అయితే కావాలో సినిమా వాతావరణం మొత్తం అలాగే ఉంటుంది. అది చూస్తూ ఉంటే సినిమా బృందం ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమా తెరపై చూపించడానికి చాలా కష్టపడ్డారు అనిపిస్తుంది. కానీ కథ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. చాలా రొటీన్ గా ఉంది. సినిమా ముందుకు వెళుతూ ఉంటే కూడా ప్రేక్షకులకు అసలు ఏమవుతుంది అనే ఆసక్తి ఒక్క చోట కూడా కనిపించదు.

agent movie review

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ స్టైలిష్ గా ఉన్న సినిమా ఇదే. లొకేషన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. చూస్తున్నంత సేపు ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్నాం ఏమో అనిపిస్తుంది. కానీ వైల్డ్ అని చెప్పి కొన్ని చోట్ల సినిమాలో కొన్ని సీన్స్ ఓవర్ గా రూపొందించారు ఏమో అనిపిస్తుంది. సినిమాకి మరొక పెద్ద మైనస్ పాటల ప్లేస్మెంట్. సినిమా మంచి ఫ్లోలో నడుస్తోంది అనుకునే సమయంలో పాటలు వస్తాయి. అసలు రామకృష్ణ గోవిందా పాట ఎందుకు వస్తుందో కూడా అర్థం కాదు. అలాగే వైల్డ్ సాలా పాట లేకపోయినా కూడా అంత పెద్ద తేడా ఏమీ అనిపించదు.

agent movie review

కానీ పాటతో పాటు పక్కన స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. సినిమాకి మరొక హైలైట్ మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటన. ఆ పాత్రకి మమ్ముట్టి చాలా బాగా సరిపోయారు. హీరోయిన్ సాక్షి వైద్య తన పాత్రకి తగ్గట్టు నటించారు. హిందీ హీరో డినో మోరియా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఒక డాన్ పాత్రకి ఎలా అయితే నటించాలో అలాగే నటించారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా మరొక రకంగా ఉండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • నిర్మాణ విలువలు
  • ఫైటింగ్ సీన్స్
  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • లొకేషన్స్

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ కథ
  • బలహీనమైన స్క్రీన్ ప్లే
  • పాటలు
  • ఓవర్ గా అనిపించే కొన్ని సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

కథపరంగా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమా చూడాలి, అసలు అఖిల్ అక్కినేని ఈ సినిమాలో ఎలా చేశారు, మమ్ముట్టి కోసం సినిమా చూడాలి అని అనుకునే వారికి ఏజెంట్ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.

watch trailer :


End of Article

You may also like