Home News “నీ కష్టమంతా తొందరలోనే తెలుస్తుంది.!” అంటూ పూజా హెగ్డేకి అఖిల్ స్పెషల్ బర్త్ డే విషెస్.!

“నీ కష్టమంతా తొందరలోనే తెలుస్తుంది.!” అంటూ పూజా హెగ్డేకి అఖిల్ స్పెషల్ బర్త్ డే విషెస్.!

by Mohana Priya

Ads

నటి పూజా హెగ్డే ఇవాళ తన 31వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతట అభిమానులు, అలాగే ఎంతో మంది సినీ ప్రముఖులు పూజా హెగ్డే కి బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యాం సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇవాళ పూజా హెగ్డే పుట్టినరోజు అవడంతో రాధే శ్యామ్ బృందం కూడా ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది.

Video Advertisement

అలాగే పూజా హెగ్డే, అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్ గా నటించారు. ఈ సందర్భంగా అఖిల్ పూజా హెగ్డే కి జన్మదిన శుభాకాంక్షలని అందించారు. అఖిల్ పూజా హెగ్డే కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేస్తూ అఖిల్ అక్కినేని, “హ్యాపీ బర్త్ డే పూజ. నువ్వు విభ రోల్ కోసం పడిన కష్టం అంత తొందరలోనే తెరపై కనిపించబోతోంది” అంటూ అఖిల్ అక్కినేని షేర్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విభ అనే స్టాండ్ అప్ కమెడియన్ పాత్రలో పూజా హెగ్డే నటించారు.


End of Article

You may also like