Home Filmy Adda “అఖిల్ అక్కినేని”కి ఆ క్రికెటర్ బయోపిక్ లో నటించాలని ఉందట.!

“అఖిల్ అక్కినేని”కి ఆ క్రికెటర్ బయోపిక్ లో నటించాలని ఉందట.!

by Mohana Priya

Ads

అఖిల్ అక్కినేని ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో హర్ష పాత్రలో అఖిల్ నటిస్తుండగా, విభ పాత్రలో పూజాహెగ్డే నటిస్తున్నారు.

Video Advertisement

6 akhil

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్ అక్కినేని పలు ఇంటర్వ్యూస్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలని చెప్పారు. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తనకి ఏ క్రికెటర్ బయోపిక్ లో నటించాలి అని ఉంది అని అడగగా, అందుకు అఖిల్ అక్కినేని విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉంది అని చెప్పారు.

ఇప్పటికే ధోని బయోపిక్ వచ్చింది ఒకవేళ నెక్స్ట్ విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తే అందులో అఖిల్ నిజంగానే నటిస్తారు ఏమో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం అఖిల్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


End of Article

You may also like