కాలమే సమాధానం చెప్తుంది అంటే ఇదేనేమో? బ్రిటన్ ని ఏలుతున్న ఇద్దరు భారతీయులు వీరే.!

కాలమే సమాధానం చెప్తుంది అంటే ఇదేనేమో? బ్రిటన్ ని ఏలుతున్న ఇద్దరు భారతీయులు వీరే.!

by Sainath Gopi

Ads

కరోనాతో బ్రిటన్ దేశ రాణి యువరాజు, ప్రధాని, ఆరోగ్య శాఖ మంత్రి ఐసోలేషన్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. ఇలాంటి సమయంలో గ్రేట్ బ్రిటన్‌ను ఇంఛార్జ్ చేసే అవకాశం ఛాన్సలర్ ఆఫ్ ఎక్సెక్వర్‌ గానీ.. హోమ్ సెక్రటరీగానీ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్న ఇద్దరు భారతీయులే. రిషి సునక్‌, ప్రీతి పటేల్‌ ఆ పదవుల్లో ఉన్నారు.

Video Advertisement

ఈ వార్త రావడంతో సోషల్ మీడియాలో మన భారతీయులు అందరు కాలమే అందరికి సమాధానం చెప్తుంది అంటే ఇదేనేమో అని కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 200 సంవత్సరాల పాటు భారత్‌ను తమ చేతుల్లో పెట్టుకొని పరిపాలించారు వారు. ఇప్పుడు అక్కడ మన వారికి అవకాశం వచ్చింది అంటూ కామెంట్స్ చేసారు. ఈ నేపథ్యంలో ఓ మెసేజ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. 300 సంవత్సరాల తరువాత సూర్యుడు అస్తమించని దేశాన్ని భారతీయులు పరిపాలిస్తున్నారు అని.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. అక్కడ ఇప్పటివరకు దాదాపు పన్నెండు వేల మందికి కరోనా సోకింది అంట. 600 మందికి పైగా మరణించారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తన ఇంట్లో ఆయన ఐసొలేషన్ లో ఉన్నారు. బ్రిటన్ రాణి కూడా ఐసొలేషన్ లో ఉన్నారు. దీంతో వారు ఇంటి నుండే పని చేస్తున్నారు.

ఇలా ముఖ్యనేతలు ఇంటికే పరిమితమయ్యారు. దీంతో అక్కడి కీలక నిర్ణయాలు తీసుకునే బాధ్యత భారతీయుల సొంతమైంది. ఆ ఇద్దరు భారతీయులే హోమ్ సెక్రటరీ ప్రీతీ పటేల్. బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునక్‌. ఈ ఏడాది ఫెబ్రవరీలోనే ఆయన నియామకం అయ్యారు. ఆయన భారత సంతతికి చెందిన వారు. రిషి సునక్ తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్నారు. తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ లో ఎంబీఏ పూర్తి చేసారు.

source: Tv9telugu.com, Yoyo tv channel

 

 


End of Article

You may also like