సెలబ్రిటీలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన వారైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి? ఏ టైంలో ఏ ఆహారం తీసుకోవాలి? ఇలాంటివి అన్నమాట. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రొఫెషనల్ కచ్చితంగా అవసరం. అందుకే ప్రైవేట్ చెఫ్ లని అపాయింట్ చేసుకుంటారు.

ప్రైవేట్ చెఫ్ సెలబ్రిటీలకు రకరకాల వంటలు చేయడం తో పాటు, ఆ సెలబ్రిటీలకు ఏ రకమైన వంటలు ఇష్టం, ఎలాంటివి తింటే వారి ఆరోగ్యానికి మంచిది అని అన్నీ తెలుసుకొని జాగ్రత్తగా డైట్ ప్లాన్ ప్రకారం వండుతారు. అలా అక్కినేని నాగార్జున – అమల కుటుంబానికి కైరవి మెహతా ప్రైవేట్ చెఫ్ గా ఉన్నారు.

సోషల్ మీడియా ద్వారా తను వండే వంటకాలని షేర్ చేస్తారు కైరవి మెహతా. కైరవి మెహతా ప్లాంట్ బేస్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వారి కోసం కొబ్బరితో పెరుగు తయారు చేస్తారట. ఈ విషయాన్ని కైరవి మెహతా ప్లేట్ పిక్సెల్స్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అక్కినేని అఖిల్, అక్కినేని అమల కూడా కైరవి మెహతా ఎంతో మంచి చెఫ్ అని సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు ప్రశంసించారు.