రామ్ పోతినేని తదుపరి సినిమాని ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నారు. లింగుసామి అంతకుముందు ఆవారా, అంజాన్, పందెంకోడి సినిమాలకు దర్శకత్వం వహించారు. రామ్ పోతినేని 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు, తమిళంలో కూడా రూపొందుతోంది. ఈ సినిమాలో, ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సెన్సేషన్ సృష్టించిన క్రితి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే నదియా కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు.akshara gowda in rapo 19

ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కూడా నటిస్తున్నారు అనే వార్తను సినిమా బృందం ఇవాళ ప్రకటించారు. ఇందులో అక్షర గౌడ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. అక్షర ఈ సినిమాలో ఆది పినిశెట్టికి జోడి గా నటిస్తారు అని సమాచారం. అక్షర అంతకుముందు మన్మధుడు 2 సినిమాలో కూడా నటించారు. ప్రస్తుతం రామ్ పోతినేని, లింగుసామి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.