Ads
- చిత్రం : సెల్ఫీ
- నటీనటులు : అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ, నుష్రత్ బరుచా, డయానా పెంటీ.
- నిర్మాత : హీరో యష్ జోహార్, అరుణా భాటియా, సుప్రియా మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టీఫెన్.
- దర్శకత్వం : రాజ్ మెహతా
- సంగీతం : అను మాలిక్, తనిష్క్ బాగ్చి, యో యో హనీ సింగ్, ది ప్రొఫెక్, లిజో జార్జ్ – DJ చేతస్, విక్రమ్ మాంట్రోస్, ఆదిత్య యాదవ్ – తరుణ్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 24, 2023
Video Advertisement
స్టోరీ :
విజయ్ కుమార్ (అక్షయ్ కుమార్) ఒక పెద్ద స్టార్ హీరో. ఒక సినిమా షూటింగ్ కోసం విజయ్ కుమార్ భోపాల్ వెళ్లాల్సి వస్తుంది. ఆ సినిమా క్లైమాక్స్ సీన్ షూట్ చేయడానికి విజయ్ కి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ కోసం విజయ్ ఆర్టీవో ఆఫీస్ కి వెళ్తాడు. అక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అయిన ఓం ప్రకాష్ అగర్వాల్ (ఇమ్రాన్ హష్మీ) విజయ్ కి వీరాభిమాని. కానీ కొన్ని కారణాల వల్ల విజయ్ కి, ఓం ప్రకాష్ కి మధ్య గొడవ మొదలవుతుంది. దాంతో విజయ్ కి చాలా కోపం వచ్చి అక్కడ అధికారుల ముందు ఓం ప్రకాష్ ని అవమానిస్తాడు. అసలు వారిద్దరికీ మధ్య గొడవ ఏంటి? దీని తర్వాత ఓం ప్రకాష్ ఏం చేశాడు? విజయ్ కి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? లైసెన్స్ దొరికిందా? లేదా? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు అక్షయ్ కుమార్. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి అక్షయ్ కుమార్ కి సరైన హిట్ రావట్లేదు. ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. కానీ అందులో ఏ ఒక్క సినిమా కూడా కమర్షియల్ విజయం సాధించలేదు. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
ఇప్పుడు సెల్ఫీ సినిమాతో అక్షయ్ కుమార్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా రీమేక్. ఈ సినిమా కమర్షియల్ గా చాలా పెద్ద విజయం సాధించింది. ఇదే సినిమాని హిందీలో తీశారు. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా ముఖ్య పాత్రలో నటించారు. అక్షయ్ కుమార్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ సినిమాలో కూడా అక్షయ్ కుమార్ పెద్ద కొత్తగా ఉన్న పాత్ర ఏమి పోషించలేదు కానీ, తనలో ఉన్న కామెడీ టైమింగ్ మరొకసారి ప్రేక్షకులని అలరిస్తుంది. అలాగే ఓం ప్రకాష్ గా నటించిన ఇమ్రాన్ హష్మీ నటన కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇలాంటి పాత్ర ఇమ్రాన్ హష్మీ పోషించడం చాలా అరుదు. కానీ కొన్ని చోట్ల మాత్రం చాలా పేలవంగా నటించారు అనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులకు మధ్య వచ్చే గొడవ, వారి అహంకారం వల్ల ఎంత దూరం వెళుతుంది అనేది ఈ సినిమా స్టోరీ పాయింట్.
ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. అసలు ఈ విజయ్ కుమార్ ఎందుకు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు? ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు? ఇదంతా చూపిస్తారు. సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరి మధ్య గొడవ ప్రేక్షకులకి చూపించారు. కానీ ఈ గొడవని తెరపై చూపించడంలో దర్శకుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన హై అంతా సెకండ్ హాఫ్ లో తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా సెకండ్ హాఫ్ కూడా బాగుండి ఉంటే సినిమా మరొక రేంజ్ లో ఉండేది ఏమో.
ప్లస్ పాయింట్స్ :
- అక్షయ్ కుమార్
- కొన్ని యాక్షన్ సీన్స్
- కామెడీ
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
- పాటలు
- సెకండ్ హాఫ్
రేటింగ్ :
2.5/5
ట్యాగ్ లైన్ :
ఎక్కువ ఆశించకుండా, ఒరిజినల్ తో పోల్చకుండా ఏదైనా ఒక ఎంటర్టైనింగ్ సినిమా చూద్దాం అనుకునే వారికి సెల్ఫీ సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
End of Article