అల వైకుంఠపురంలో నెట్ ఫ్లిక్స్ లో ఎందుకు స్ట్రీమ్ అవుతుంది? అసలు కథ బయటపెట్టిన బ్లూ స్కై మీడియా.!!!

అల వైకుంఠపురంలో నెట్ ఫ్లిక్స్ లో ఎందుకు స్ట్రీమ్ అవుతుంది? అసలు కథ బయటపెట్టిన బ్లూ స్కై మీడియా.!!!

by Sainath Gopi

Ads

సంక్రాంతికి వచ్చిన రెండు సినిమాలు “అల వైకుంఠపురంలో” , “సరిలేరు నీకెవ్వరూ” ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకున్నాయి అనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. కలెక్షన్స్ చూస్తేనే అర్ధం అయిపోతుంది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ మరోసారి హిట్ అందుకుంది. అల వైకుంఠపురంలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ సంచలనం సృష్టిస్తున్నాయి.

Video Advertisement

సంక్రాంతికి సూపర్ హిట్ అయిన చిత్రం “అల వైకుంఠపురంలో”…అల్లు అర్జున్ నటన, థమన్ మ్యూజిక్, త్రివిక్రమ్ డైరెక్షన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన బుట్టబొమ్మ పూజా హెగ్డే మరో ఎత్తు. ఇక అసలు విషయానికి వస్తే..సినిమా రిలీజ్ కి ముందు అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని పోస్టర్ లో వేశారు. కానీ ఇటీవలే నెట్ ఫిల్క్స్, సన్ నెక్స్ట్ లో ఈ సినిమా రిలీజ్ చేసారు. దీనిపై నెటిజెన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.

ప్రస్తుతం చాలా మంది సినిమాలను థియేటర్ కి వెళ్లకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు చూస్తున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకే అందులో రావడంతో థియేటర్స్ పై ఎక్కువ మక్కువ చూపించట్లేదు. విదేశాల్లో అయితే ఇది మరి ఎక్కువ.

అయితే అలా వైకుంఠపురంలో సినిమాకి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో లభించదు తెలిసి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూసారు. పాజిటివ్ టాక్ రావడంతో అందరు థియేటర్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు ఇలా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరు ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.

అయితే ఇప్పుడు బ్లూ స్కై మీడియా అసలు కథ బయటపెట్టింది. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసమే సదరు రెండు సంస్థలతోనూ ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారట. సినిమా ప్రమోషన్ లో జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని బ్లూ స్కై సినిమాస్ తెలిపింది.

source


End of Article

You may also like