“రణబీర్” కంటే ముందు అలియా రిలేషన్ లో ఉన్న హీరోలు ఎవరో తెలుసా? లిస్ట్ ఓ లుక్ వేయండి..!

“రణబీర్” కంటే ముందు అలియా రిలేషన్ లో ఉన్న హీరోలు ఎవరో తెలుసా? లిస్ట్ ఓ లుక్ వేయండి..!

by Megha Varna

Ads

అలియా భట్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. అలియా భట్ అందరికీ సుపరిచితమే. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది అలియా భట్. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి తెరంగ్రేటం చేసింది అలియా. అయితే ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంత మందిని లవ్ చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

Video Advertisement

మరి ఈ అందాల తార ఎంత మంది ప్రేమలో పడింది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యనే రణబీర్ కపూర్ ని అలియా భట్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే అంతకు ముందు ఈమె నలుగురుతో అఫైర్స్ నడిపింది. ఆఖరికి రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది అలియా. అయితే మరి అలియా ఎవరెవరితో ప్రేమలో పడింది అనేది ఇప్పుడు చూద్దాం.

#1. అలీ దాదార్కర్:

అలియా భట్ స్నేహితుడైన అలీ దాదార్కర్ తో లవ్ ఎఫైర్ నడిపింది అలియా భట్. సినిమాల్లోకి రాక ముందే ఇతనితో లవ్లో పడింది ఈ అమ్మడు. చిన్నప్పటి నుంచి కూడా అలియా భట్ కి ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్లతో ఆమె ఎక్కువ సేపు స్పెండ్ చేస్తూ ఉండేది. అలా ఆమె టైం స్పెండ్ చేసే స్నేహితులలో ఒకరు అలీ దాదార్కర్. తర్వాత వీళ్ల రిలేషన్ బ్రేక్ అయింది. అలీ దాదార్కర్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

#2. సిద్ధార్థ మల్హోత్రా:

అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాలో నటించారు. ఈ ఇద్దరి తారలకు ఇదే మొదటి చిత్రం. దీంతో వీళ్ళ మధ్య చనువు ఎక్కువై ప్రేమ మొదలైంది. అలియా భట్ సిద్ధార్థ్ మల్హోత్రా తో బాగా దగ్గర అయినప్పటికీ సిద్ధార్థ మాత్రం మరొక హీరోయిన్ తో బాగా క్లోజ్ గా ఉండే వాడు దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ బ్రేక్ అయింది.

#3. వరుణ్ ధావన్:

అలియా వరుణ్ ధావన్ ఇద్దరూ బాల్య స్నేహితులు. అయితే అలియా తర్వాత పెద్ద హీరోయిన్ అవ్వడంతో వరుణ్ ధావన్ ని దూరం పెట్టేసింది. తర్వాత వరుణ్ ధావన్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

#4. కవిన్ మిట్టల్:

అలియా కవిన్ మిట్టల్ తో కూడా ప్రేమ వ్యవహారం నడిపింది. హైక్ యాప్ సంస్థ అధినేత అయిన కవిన్ మిట్టల్ మరియు అలియా ప్రేమలో ఉండేవారు. ఎప్పుడూ అలియా ఈ విషయంని అధికారికంగా ప్రకటించ లేదు. కేవలం రూమర్స్ మాత్రమే వచ్చాయి. ఇలా ఈమె ఆఖరికి ఇంత మందితో ప్రేమలో పడి రణబీర్ కపూర్ ను వివాహం చేసుకుంది.


End of Article

You may also like