Ads
ప్రతిసారి జీవితంలో మనకు అనుకూలమైన సంఘటనలే జరుగుతాయి అన్న గ్యారంటీ లేదు. మారుతున్న సమాజంలో ఎప్పుడు ఏవి ఎలా మారుతాయో చెప్పడం కష్టం అయిపోతుంది.
Video Advertisement
ఇంటి బాధ్యతలు భరించలేక.. మిగిలిన వారి బాధలు తీర్చడం కోసం ఒక కన్న తండ్రి ఏకంగా తన కొడుకునే అమ్మకానికి పెట్టాడు. వినడానికి వింతగా ఉన్న ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే పాన్ షాప్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే వ్యక్తి తన ఇద్దరి కూతుర్ల పెళ్లి కోసం కొడుకును బలవంతంగా అమ్మేశాడు. ఈ వింత సంఘటన అలీగఢ్‌లో ని క్వార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల చందానియా ప్రాంతం దగ్గర జరిగింది. అంతేకాకుండా తన పిల్లలను మరియు చెల్లెలను పోషించడం కష్టంగా ఉందని ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేకున్నానని ఆ సదరు వ్యక్తి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా లేఖ రాసి వేడుకున్నారు.
తన కుటుంబానికి జీవనోపాధిగా ఉన్న పాన్ షాప్ ని రౌడీలు అతని నుంచి అన్యాయంగా తీసుకోవడం వల్ల అతని రాబడి పడిపోయింది. పైగా సంజయ్ సైనీ వడ్డీ వ్యాపారం పుణ్యమా అని అప్పుల పాలయ్యాడు. ఇక ఇద్దరి చెల్లెలు మరియు తన కుమార్తెల బాధ్యత అతని నెత్తి మీదే పడడంతో తట్టుకోలేక ఆదుకోమని తన గోడు వెళ్ళబోస్తూ సీఎంకు ఇతను లేఖ రాశాడు.
సంజయ్ సైనీ మాటల ప్రకారం ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక…ఇక అప్పు చేద్దామన్న ఎవరు ఇచ్చే వసతి కూడా లేక…తప్పనిసరి పరిస్థితుల్లో తన కొడుకును బేరానికి పెట్టారట. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతోమంది దీని గురించి రకరకాలుగా స్పందిస్తున్నారు…కానీ ఆపదలో ఉన్న మనిషిని కూడా ఆదుకోవడానికి ముందుకు రాని …మరుగున పడిన మానవత్వం.. లోపిస్తున్న విలువల కారణంగా ఇటువంటి సంఘటనలు తలెత్తుతున్నాయి.
ALSO READ : భార్య ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు… కానీ ఆమె మాత్రం..? ఇతని మాటలు చూస్తే కన్నీళ్లు ఆగవు..!
End of Article