యూఎస్ఏ, బ్రెజిల్ తర్వాత కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. తమ ప్రయోగాలతో చేసిన మందులు, చికిత్సల వల్ల కరోనా బారిన పడ్డ వాళ్ళు కొంతవరకు కోలుకోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా టాప్ స్థానంలో ఉన్న డాక్టర్లు కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. భారతదేశంలో కూడా రెండు కంపెనీలు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టాయి. అవి ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయి.

Video Advertisement

#1 కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ మొదటి అడుగు వేసింది. హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (BBIL) తయారుచేసిన కోవిడ్ 19 కో వ్యాక్సిన్ మొదటి దశ క్లినికల్ ట్రయల్ జూలై 15న ప్రారంభించింది. 375 మంది వాలంటీర్లతో ఈ క్లినికల్ ట్రయల్ ను నిర్వహిస్తున్నారు.

#2. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 6 నెలల సమయం పట్టవచ్చు. కానీ ఈ మెడిసిన్ ప్రభావం ఎలా ఉందో, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో లేదో అని తెలుసుకోవడానికి మాత్రమే రెండు మూడు నెలల సమయం పట్టొచ్చట. భారత దేశ వ్యాప్తంగా 12 ఆసుపత్రిలని ఎంచుకుని అందులో ఈ ట్రయల్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

#3. రోజూ పది మందికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. రెండవ దశలో వ్యాక్సిన్ తీసుకునే వాళ్ల సంఖ్య పెరుగుతుంది అంతేకాకుండా వ్యాక్సిన్ కూడా ఎక్కువ మొత్తంలో తయారు చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్ చేయడానికి భారత్ బయోటెక్ మన దేశంలో ఉన్న డ్రగ్ రెగ్యులేటర్ల నుండి అనుమతి పొందింది.

#4. ప్రపంచమంతటా యాంటీ కరోనా వ్యాక్సిన్ లు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క ట్రయల్ దశలో ఉంది. ఇటీవల అహ్మదాబాద్ కి చెందిన జైడస్ సంస్థ తయారు చేసిన ZyCoV-D వ్యాక్సిన్ తో మనుషుల పై ట్రయిల్ ప్రక్రియను నిర్వహించడం మొదలు పెట్టింది. దాదాపు 1000 కి పైగా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ట్రయల్ నిర్వహిస్తున్నారట.

#5. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ వాళ్లు తయారుచేసిన కో వ్యాక్సిన్ కి అనుమతి వచ్చిన కొన్ని రోజులకి జైడస్ సంస్థ కి కూడా మనుషుల మీద ప్రయోగించడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతి వచ్చింది.

దీనిపై జైడస్ చైర్మన్ పంకజ్ పటేల్ మాట్లాడుతూ “2021 కి ముందే ఈ వ్యాక్సిన్ జనాలకి అందుబాటులోకి తీసుకురావాలి అని అనుకుంటున్నాము. మూడు నెలల తర్వాత మూడవ దశ ట్రయల్స్ కూడా మొదలు పెడతాము. ఈ మూడు నెలల్లో మొదటి దశ ఇంకా రెండవ దశ ట్రయల్స్ చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తే వ్యాక్సిన్ కి అధికారికంగా అనుమతి లభిస్తుంది. ఒకవేళ అత్యవసరమైతే ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది” అని చెప్పారు.